సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇక లేరు..

Published : Jan 09, 2024, 05:00 PM IST
 సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇక లేరు..

సారాంశం

Maestro Rashid Khan : సంగీత విద్వాంసుడు రషీద్ ఖాన్ ఇక లేరు. గత కొంత కాలం నుంచి ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితమే కోల్ కతాలోని ఓ హాస్పిటల్ లో చనిపోయారు.

Ustad Rashid Khan : ప్రముఖ సంగీ విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూశారు. కొంత కాలం నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు. దాని కోసం కోల్ కతాకు చెందిన ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై ఉండి ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన  తన 55 ఏళ్ల వయస్సులో చనిపోయారు.

భక్తిని చూపించండి.. అనవసర ప్రకటనలు చేయొద్దు - బీజేపీ నేతలకు ప్రధాని సూచన

గత నెలలో ఆయనకు సెరిబ్రల్ ఎటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన రషీద్ ఖాన్.. తొలుత టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే ఆ తర్వాతి దశలో కోల్ కతాలోనే చికిత్స కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. గత నెలలో ప్రైవేటు హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందించారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. 
 

ఉత్తరప్రదేశ్ లోని బదాయూన్ లో జన్మించిన రషీద్ ఖాన్ తన మేనమామ ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్ (1909-1993) వద్ద ప్రాథమిక శిక్షణ పొందాడు. రషీద్ కు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ మేనమామ అవుతారు. కాగా.. ఆయన మరణంపై సోషల్ మీడియాతో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !