కనీస మద్దతు ధర చట్టం తేవాలి: ఆల్‌ పార్టీ భేటీలో విపక్షాల డిమాండ్

By narsimha lodeFirst Published Nov 28, 2021, 4:05 PM IST
Highlights

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు  ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో తమకు స్పష్టత ఇస్తారని భావించామని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. 

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందే రోజే ప్రభుత్వం పిలిచిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గైర్హజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు.ఈ All Parrty meetingకి ప్రధాన మంత్రి Narendra Modi హాజరు అవుతామని తాము ఆశించినట్టుగా రాజ్యసభలో విపక్షనేత Mallikarjun Kharge చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను మరో రూపంలో ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉందనే భయం ఉందన్నారు.ఈ విషయమై తాము అడగాలనుకొంటున్నామని ఖర్గే తెలిపారు.


 New Farm law acts రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  ఆందోళన సమయంలో మృతి చెందిన Farmers కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని Congress డిమాండ్ చేసింది. ఇంధన ధరల పెరుగుదల, వాస్తవాధీన రేఖ వద్ద Chinaతో ఉద్రిక్తతల విషయాన్ని కూడా కాంగ్రెస్ లేవనెత్తింది. ఆల్ పార్టీ సమావేశానికి ప్రధాని గైర్హాజరు కావడం సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడమేనని విపక్షాలు చేసిన విమర్శలను పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖండించారు.అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి హాజరయ్యే సంప్రదాయం లేదని ఆయన వివరించారు.  ఆల్ పార్టీ భేటీకి 31 పార్టీల ప్రతినిధులు హాజరైనట్టుగా ఆయన తెలిపారు.

తనను మాట్లాడకుండా అడ్డుకొంటున్నారని ఆరోపిస్తూ ఆప్ నేత సంజయ్ సింగ్ సమావేశం నుండి వాకౌట్ చేశారు. కనీస మద్దతు ధరలపై చట్టం కోసం ఈ సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.ఆల్ పార్టీ సమావేశంలో ఏ సభ్యుడిని మాట్లాడనివ్వరని ఆయన చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎంఎస్‌పీ హామీపై చట్టం తీసుకురావాలనే అంశాన్ని తాను లేవనెత్తుతానని ఆయన చెప్పారు.
msp కోసం  చట్టబద్దమైన తీర్మానం తేవడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.ఉత్తర్‌ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ లో రైతుల మృతికి కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రా తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను  మంత్రివర్గం నుండి తప్పించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి  బిల్లును ప్రభుత్వం సోమవారం నాడు ప్రవేశ పెట్టనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ సింగ్ ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో తమ పార్టీ ఎంపీలు విధిగా పార్లమెంట్ కు హాజరు కావాలని విప్ జారీ చేశాయి.

also read:పార్లమెంటుకు ‘ట్రాక్టర్ మార్చ్’ వాయిదా.. సోమవారమే సాగు చట్టాల రద్దు బిల్లు

 ఈ సమావేశానికి కాంగ్రెస్ నుండి మల్లిఖార్జున్ ఖర్గే తో పాటు అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ, డిఎంకె నుండి టీఆర్ బాలు,  తిరుచ్చి శివ, ఎన్సీపీ నుండి శరద్ పవార్, శివసేన నుండి వినాయక్ రౌత్, సమాజ్ వాదీ పార్టీ నుండి రాంగోపాల్ యాదవ్,  బీఎస్పీ నుండి సతీష్ మిశ్రా, బీజేడీ నుండి ప్రసన్న ఆచార్య , నేషనల్ కాన్ఫరెన్స్ నుండి ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకొంది. అయితే ఎంఎస్పీ చట్టం తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన చేస్తామని రైతులు తేల్చి చెప్పారు. 
 

click me!