ఛండీగడ్‌లో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ

By Mahesh KFirst Published Aug 23, 2022, 4:56 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఛండీగడ్‌లో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉండే పంజాబ్ సమీపంలో ఈ హాస్పిటల్‌ను కేంద్ర ప్రభుత్వం రూ. 660 కోట్లు వెచ్చించి నిర్మించింది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఛండీగడ్‌లో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను రేపు జాతికి అంకితం చేయనున్నారు. ఈ హాస్పిటల్‌ను రూ. 660 కోట్లతో కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తున్నది. న్యూ ఛండీగడ్‌లోని ముల్లంపూర్‌లో ఈ హాస్పిటల్ నిర్మించారు. ఈ క్యాన్సర్ హాస్పిటల్‌ 300 బెడ్‌ల సామర్థ్యంతో అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఈ హాస్పిటల్‌లో క్యాన్సర్‌కు అందించే అన్ని రకాల చికిత్సలు సర్జరీ, రేడియోథెరపీ, మెడికల్ ఆంకాలజీ, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ల వసతలూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

పంజాబ్‌లో క్యాన్సర్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఛండీగడ్‌లో ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. పంజాబ్ నుంచి క్యాన్సర్ పేషెంట్లు చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తున్నది. పంజాబ్‌లో క్యాన్సర్ ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇక్కడ భటిండా నుంచి వచ్చే ఒక ట్రైన్‌కు క్యాన్సర్ ట్రైన్ అనే పేరు పెట్టారు.

రేపు ప్రధాని మోడీ ప్రారంభించనున్న హాస్పిటల్ క్యాన్సర్ కేర్‌కు హబ్‌గా వెలుగొందనుంది. ఈ హాస్పిటల్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు వచ్చి చికిత్స పొందవచ్చు.

2014 నుంచి క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు కేంద్రం కృషి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన లక్ష్యం క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చుల బెడద నుంచి తప్పించడంగా ఉన్నది. అలాగే, ప్రతి ఏడాది హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ రూ. 5 లక్షల వరకు కేంద్రం కల్పించింది. యాంటీ క్యాన్సర్ యాంటీ షెడ్యూల్డ్ మెడిసిన్స్ సుమారు 390పై ఎంఆర్పీని 87 శాతం 2019లో తగ్గించింది.

ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించిన క్యాన్సర్ హాస్పిటళ్లు ఇలా ఉన్నాయి. 2022 ఏప్రిల్ 28న అసోంలో ఏడు క్యాన్సర్ హాస్పిటల్‌లను ప్రధాని మోడీ ప్రారంభించారు. 2022 జనవరి 7న కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను మోడీ ప్రారంభించారు.

click me!