
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హైదరాబాద్‌లో శాంతి నెలకొనడం బీజేపీకి ఇష్టం లేదు. మహ్మద్ ప్రవక్త, ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోంది. ఆ పార్టీ భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయాలనుకుంటున్నారు ’’ అని ఆయన అన్నారు.
అందరూ నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలంటున్నారు.. నేను ఆమెకు మద్దతు ఇస్తున్నా..: రాజ్ ఠాక్రే సంచలనం
రాజకీయంగా తమతో పోరాడాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. రాజాసింగ్ మాటలకు ప్రధాని మోదీ, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే దీనిపై మాట్లాడాలని అన్నారు. రాజా సింగ్‌కు వ్యతిరేకంగా చేసిన పలువురు చేసిన ‘సర్ తాన్ సే జుడా’ నినాదాలను కూడా ఆయన ఖండించారు. సార్ తాన్ సే జుడా)నినాదాలను కూడా ఖండిస్తున్నాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారితో చెబుతాను ’’ అని ఆయన అన్నారు.
కాగా.. హైదరాబాద్ లో ఇటీవల ప్రదర్శన ఇచ్చిన స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని విమర్శిస్తూ వీడియోను విడుదల చేసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు నేడు తెల్లవారుజామున అరెస్టు చేశారు. సౌత్, ఈస్ట్, వెస్ట్ జోన్‌ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో సింగ్‌పై ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. సింగ్‌పై తమకు ఫిర్యాదు అందిందని, బీజేపీ ఎమ్మెల్యే మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని దబీర్‌పూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి కోటేశ్వర్ రావు తెలిపారు.
బండి సంజయ్ అరెస్టును ఖండించిన జేపీ నడ్డా.. కేసీఆర్ పై ఘాటు విమర్శలు
ఇదిలా ఉండగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. శాసనసభా పక్ష నేత పదవి నుంచి కూడా ఆయనను తప్పించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని ఆయనను అంతకు ముందు కోరింది. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.
అల్లోపతి డాక్టర్లపై ఆరోపణలు ఎందుకు?.. దానికి గ్యారంటీ ఇస్తాడా?: బాబా రాందేవ్‌పై సుప్రీం కోర్టు ఫైర్
ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రటరీ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని ఆ నోట్ పేర్కొంది. ఆయనకు ఉన్న బాధ్యతల నుంచి ఆయనను వెంటనే తొలగిస్తున్నామని చెపపింది. బీజేపీ నియామావళికి విరుద్దంగా వ్యవహరించినందుకు గాను ఈ చర్యలు తీసుకొంటున్నట్టుగా ఈ ప్రకటన పేర్కొంది. పార్టీ నియామావళిని ఉల్లంఘించినందుకు రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయంలో ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీలోపు సంజాయితీ ఇవ్వాలని కోరింది.