G20 summit 2023 : జీ 20 సమావేశాల్లో చేయాల్సినవి.. చేయకూడనవి : మంత్రులకు మోడీ కీలక సూచనలు

By Siva Kodati  |  First Published Sep 6, 2023, 7:50 PM IST

ప్రతిష్టాత్మక జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు కీలక సూచనలు చేశారు.  భారత్ మండపం సహా ఇతర వేదికల వద్దకు చేరుకోవడానికి షటిల్ సర్వీసులు వినియోగించుకోవాలని మోడీ కోరారు.


ప్రతిష్టాత్మక జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు కీలక సూచనలు చేశారు. అతిథులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని.. తమ అధికారిక వాహనాలను పక్కనపెట్టాలని సూచించారు. వీఐపీ వాహనాల్లో తిరిగితే ప్రోటోకాల్ సమస్యలు వస్తాయని.. భారత్ మండపం సహా ఇతర వేదికల వద్దకు చేరుకోవడానికి షటిల్ సర్వీసులు వినియోగించుకోవాలని మోడీ కోరారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. జీ 20 ఇండియా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఈ యాప్‌లో అన్ని భారతీయ భాషలు, జీ 20 దేశాల తక్షణ అనువాద ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. విదేశాలకు చెందిన అతిథులతో సంభాషించే సమయంలో అనువాదం ఫీచర్ ఉపయోగపడుతుందని మోడీ పేర్కొన్నారు. 

Latest Videos

ALsg Read: దేశ వృద్ధి ప్ర‌యాణంలో మ‌హిళ‌లు చోదక శక్తిగా ఎదుగుతున్నారు : ప్ర‌ధాని మోడీ

విదేశీ ప్రముఖులు వస్తున్నందున మంత్రులు వారి వారి సంస్కృతుల గురించి అవగాహన పెంచుకోవాలని ప్రధాని తెలిపారు. జీ20 సదస్సు ఏ మంత్రి పడితే ఆ మంత్రి మాట్లాడరాదని.. కేవలం కొందరే మాట్లాడాలని మోడీ సూచించారు. జీ20 సమ్మిట్‌కు ఆహ్వానాలు అందుకున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వారి వ్యక్తిగత వాహనాల్లోనే నిర్ణీత సమయానికి చేరుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. జీ 20 సమ్మిట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్ ఈ నెల 9న సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. దీనికి గంట ముందే వేదిక వద్దకు ముఖ్యమంత్రులు చేరుకోవాల్సి వుంటుంది. ఆహ్వానితులందరికీ జీ20 మొబైల్ నెట్‌వర్క్ పరిధిని కల్పిస్తారు. 

click me!