ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ ... మోదీ తెలుగు ట్వీట్స్

Published : Mar 29, 2019, 10:58 AM IST
ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ ... మోదీ తెలుగు ట్వీట్స్

సారాంశం

ప్రధాని నరంద్రమోదీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు

ప్రధాని నరంద్రమోదీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఆయన తెలుగులో చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా ఆ పరిసరాల ప్రాంతాల్లోని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తానని తెలిపారు. దేశ ప్రజలు తిరిగి ఎన్డీయే మిత్ర పక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో కూడా వివరంగా చెప్తానని పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో తాను ఈ రోజు సాయంత్రం కర్నూలులోని ఓ ర్యాలీలో పాల్గొంటున్నట్లు వివరించారు. ‘‘మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది. యువత కలలు నెరవేర్చటానికి  నేను ఆంధ్ర ప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను.’’ అని ఆయన ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?