బిజెపి నాయకుడి ఇంటిపై బాంబులతో తెగబడ్డ మావోలు....

By Arun Kumar PFirst Published Mar 28, 2019, 3:53 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉత్తరాది రాష్ట్రమైన బీహార్ లో మావోలు రెచ్చిపోయారు. ఏకంగా అధికార పార్టీకి మిత్రపక్షమైన బిజెపి ఎమ్మెల్సీ ఇంటిపైనే బాంబులతో దాడులకు తెగబడ్డారు. అయితే ఈ దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ బాంబు పేలుడు దాడికి ఇల్లు మొత్తం ధ్వంసమై ఆస్తి నష్టం జరిగింది. 

గయ జిల్లా డుమ్రియా ప్రాంతానికి చెందిన బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిపై బుధవారం అర్థరాత్రి మావోలు దాడికి పాల్పడ్డారు. డైనమైట్స్ సాయంతో ఇంటిని పేల్చేసి భయాపక వాతావరణాన్ని సృష్టించారని జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. 

ఈ దాడిలో దాదాపు 20-30 మంది తో కూడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సిపిఐ) కి చెందిన మావోల దళం పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. భారీ మరణాయుధాలతో ఎమ్మెల్సీ ఇంటి వద్దకు ప్రవేశించిన వారు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారని...దీంతో ఇళ్లు మొత్తం ద్వంసం అయిందని పేర్కొన్నారు. ఈ దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పిందని మిశ్రా  వెల్లడించారు.  
 
దాడి అనంతరం నక్సల్స్ ఎన్నికలు బహిష్కరించాలని పేర్కొంటూ కొన్ని పోస్టర్లు వదిలి వెళ్లారని తెలిపారు. ఎన్నికలు జరిపితే ఇలాంటి తీవ్ర పరిణామాలాలకు తయారుగా వుండాలని ఈ పోస్టర్ల ద్వారా బెదిరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ పోస్టర్లు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని... ఈ దాడిపై దర్యాప్తు జరుపుతున్నట్లు రాజీవ్ మిశ్రా తెలిపారు. 

click me!