
Prime Minister Narendra Modi : దేశంలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. ఇదే సమయంలో చాలా ప్రాంతాల్లో వేడిగాలుల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో తుఫాను పరిస్థితులు ఈశాన్య భారత రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. దేశంలో కొనసాగుతున్న వడగాలుల (హీట్ వేవ్) పరిస్థితిని, రుతుపవనాల రాకకు సన్నద్ధతను సమీక్షించడానికి లోక్ కల్యాణ్ మార్గ్ లోని 7వ నెంబరులోని తన నివాసంలో ప్రధాని మోడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఐఎండీ అంచనాల ప్రకారం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు ప్రధానికి వివరించారు. ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, ద్వీపకల్ప భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో అధికారులు ఆయా పరిస్థితులను అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.
INDIA VS IRELAND: టీ20 వరల్డ్ కప్ 2024లో ఐర్లాండ్ తో తొలి పోరుకు సై.. భారత్ రికార్డులు ఇవే
అగ్నిప్రమాదాలను నివారించడానికి, నిర్వహించడానికి సరైన చర్యలు క్రమం తప్పకుండా చేయాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు. అడవుల్లో ఫైర్ లైన్ నిర్వహణ, బయోమాస్ ఉత్పాదక వినియోగం కోసం క్రమం తప్పకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అడవుల్లో మంటలను సకాలంలో గుర్తించడంలో, వాటి నిర్వహణలో 'వాన్ అగ్ని' పోర్టల్ ఉపయోగం గురించి ప్రధానికి అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఎన్డీఆర్ఎఫ్ డీజీ, ఎన్డీఎంఏ మెంబర్ సెక్రటరీతో పాటు పీఎంవో, సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
"భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంచనాలు-హైప్ భయాన్ని కలిగిస్తున్నాయి.."