పీఎం కేర్స్ వెంటిలేటర్లలో లోపాలు.. ప్రధాని మోడీ సీరియస్, ఆడిట్‌కు ఆదేశం

By Siva Kodati  |  First Published May 15, 2021, 5:48 PM IST

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ కట్టడిపై ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో టెస్టుల సంఖ్య వారానికి 50 లక్షల నుంచి 1.3 కోట్లకు పెరిగాయని తెలిపారు. సెకండ్ వేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రధాని చెప్పారు


దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ కట్టడిపై ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో టెస్టుల సంఖ్య వారానికి 50 లక్షల నుంచి 1.3 కోట్లకు పెరిగాయని తెలిపారు.

సెకండ్ వేవ్‌లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రధాని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనే టెస్టులు పెంచాలని మోడీ రాష్ట్రాలకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

Latest Videos

undefined

ఇంటింటి సర్వే, టెస్టింగ్ జరపడంపై దృష్టి పెట్టాలని నరేంద్రమోడీ సూచించారు. మరోవైపు కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ వస్తోన్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా పరిగణించారు.

Also Read:మొరాయిస్తున్న పీఎం కేర్ వెంటిలేటర్లు.. కుప్పలు కుప్పలుగా వృథాగా

దానికి సంబంధించి వెంటనే ఆడిట్‌ నిర్వహించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. అలాగే సరిగా పనిచేస్తోన్న వెంటిలేటర్ల విషయంలో ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. పీఎం కేర్స్ నిధులతో పలు రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లను సరఫరా చేసిన సంగతి తెలిసిందే.

అయితే రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆ వెంటిలేటర్లలో సమస్య తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే దర్యాప్తు జరిపించాలని ఆయన ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.   

click me!