కరోనా కట్టడిలో రాష్ట్రాల పనితీరు భేష్: ప్రధాని మోడీ ప్రశంసలు

Siva Kodati |  
Published : May 11, 2020, 08:27 PM ISTUpdated : May 12, 2020, 12:20 PM IST
కరోనా కట్టడిలో రాష్ట్రాల పనితీరు భేష్: ప్రధాని మోడీ ప్రశంసలు

సారాంశం

కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. సోమవారం దేశంలో కోవిడ్ 19పై ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. సోమవారం దేశంలో కోవిడ్ 19పై ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్ధితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి సమతుల వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని మోడీ చెప్పారు.

Also Read:కరోనా మరణాలపై డౌట్స్: సాక్ష్యం ఇదేనని కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజెన్

ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో కేంద్రం నిర్ణయిస్తుందని చెప్పారు. కోవిడ్ 19 మహమ్మారి నుంచి భారత్ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్ ప్రపంచం భావిస్తోందని మోడీ వ్యాఖ్యానించారు.

Also Read:కరోనాతో కలిసే జీవించాలి... అందుకోసమే స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌: మోదీకి జగన్ సూచన

ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయని.. భౌతిక దూరం నియమాలు పాటించని చోట్ల సమస్యలు పెరిగాయని ప్రధాని గుర్తుచేశారు. లాక్‌డౌన్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చినా కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మన ముందున్న అతిపెద్ద సవాలు అని ప్రధాని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!