టిక్కెట్ల కోసం ఎగబడిన జనం, ఐఆర్‌సీటీసీ సైట్ క్రాష్..? : స్పందించిన రైల్వేశాఖ

By Siva KodatiFirst Published May 11, 2020, 6:59 PM IST
Highlights

దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రైళ్లు, బస్సులు, విమాన సర్వీసుల వంటి ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఈ క్రమంలో భారతీయ రైల్వేశాఖ రైలు సర్వీసులను దశల వారీగా పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రైళ్లు, బస్సులు, విమాన సర్వీసుల వంటి ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఈ క్రమంలో భారతీయ రైల్వేశాఖ రైలు సర్వీసులను దశల వారీగా పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తొలుత దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముఖ్యమైన నగరాలకు ప్రయాణించేందుకు 15 రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపింది.

Also Read:రైళ్లు ఇప్పుడే నడపొద్దు, వ్యాక్సిన్ హైద్రాబాద్ నుండే: మోడీతో కేసీఆర్

రైల్వేశాఖ ప్రకటనతో రిజర్వేషన్ కోసం ప్రయత్నించిన వారికి నిరాశే ఎదురైంది. సైట్ క్రాష్ అయినట్లు వార్తలు వచ్చాయి. మళ్లీ కొద్దిసేపటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీనిపై గందరగోళం నెలకొనడంతో రైల్వేశాఖ స్పష్టత ఇచ్చింది. ఐఆర్‌సీటీసీ సైట్ క్రాష్ కాలేదని వెల్లడించింది.

మరోవైపు ఈ ప్రత్యేక రైళ్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు వసూలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఏడు రోజుల ముందస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతించామని, ఖరారైన టికెట్లు మాత్రమే జారీ చేస్తామని రైల్వే శాఖ తెలిపింది.

Also Read:ఇండియాలో విజృంభిస్తున్న కరోనా: 24 గంటల్లో 4,213 కేసులు, మొత్తం 67,152కి చేరిక

వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ ఉండవని వివరించింది. టికెట్ల రద్దు కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. క్యాటరింగ్ ధరలను టికెట్ల ఛార్జీల్లో కలపడం లేదని, ఆహారాన్ని బుక్ చేసుకునే సదుపాయాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోందని పేర్కొంది. 

click me!