కొంటె మోడీ.. మ్యాజిక్ చేసి చిన్నారుల్ని మాయ చేశారు..వీడియో వైరల్

Published : Nov 16, 2023, 10:26 AM IST
కొంటె మోడీ.. మ్యాజిక్ చేసి చిన్నారుల్ని మాయ చేశారు..వీడియో వైరల్

సారాంశం

నా చిన్నారి స్నేహితులతో కొన్ని అపూర్వ క్షణాలు అంటూ ప్రధాని నరేంద్రమోడీ ఓ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు.

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోడీ చిన్నపిల్లాడైపోయాడు. తన చిన్నారి స్నేహితులతో కలిసి కాసేపు సరదాగా ఆటలాడారు. మ్యాజిక్ లు చేసి వారిని మెస్మరైజ్ చేశారు. ఎప్పుడూ రాజకీయాల్లో మునిగి తేలే ప్రధాని ఇలా చిన్నారులతో మైమరచిపోవడం చూసినవారందరూ అబ్బురపడుతున్నారు. ఆయనలోని మరో కోణం ఎంత అద్భుతమైనదంటూ అబ్బురపడుతున్నారు. 

ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ‘చాలా బాగా నచ్చారంటూ’.. కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏముందంటే.. ఓ ఇద్దరు చిన్నారులు మోడీని కలవడానికి వచ్చారు. అందులో ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. మోడీ వారితో సరదాగా గడిపారు. ఓ రూపాయి బిళ్లతో మ్యాజిక్ చేశారు. నుదుటి మీద రూపాయి బిళ్ల అతికించుకుని, తల వెనక నుంచి కొట్టుకుని.. రూపాయి చేతిలో పడేలా చేశారు.

ఉద్విగ్న భరితక్షణాలు : వందేమాతరంతో మారుమోగిన వాంఖడే.. ఒకేసారి 32వేలమంది ఆలాపన...

ఆ చిన్నారులను కూడా అలాగే చేయమని చెప్పారు. తానే స్వయంగా రూపాయి బిళ్లను వారి నుదుటిమీద అతికించినట్టు చేశారు. కానీ సెకన్లలో బిళ్లను మాయం చేసి..ఆ చిన్నారులను గందరగోళంలో పడేశారు. ఆ అమ్మాయి మోడీ అసలు తన నుదుటి మీద రూపాయి బిళ్ల పెట్టలేదన్న విషయం తెలుసన్నట్టుగా.. ఆయన చేతులు వెతుకుతోంది. ఇదంతా కాసేపు అక్కడి వాతావరణాన్ని హృద్యంగా మార్చేసింది. 

దీనికి సంబంధించిన వీడియో ప్రధాని మోడీ అఫీషియల్ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీని మీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మోడీ చర్యకు అందరూ అబ్బురపడుతున్నారు. ప్రధాని మోదీ ఇలా చిన్నారులతో ఇంటరాక్ట్ అవ్వడం సరదాగా గడపడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఇలాంటివి వైరల్ గా మారాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway