వివాహితపై యువకుడి అత్యాచార యత్నం.. మాటల్లో పెట్టి పురుషాంగాన్ని కోసి, పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన బాధితురాలు

By Asianet News  |  First Published Nov 16, 2023, 9:53 AM IST

అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ యువకుడి పురుషాంగాన్ని కోసేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో మంగళవారం జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


ఓ వివాహితపై యువకుడు అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె అతడి పురుషాంగాన్ని కత్తితో కోసేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆ యువకుడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆమె ధైర్యం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. 

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కౌశంబి జిల్లాలోని మంజన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ వివాహిత నివసిస్తోంది. ఆమె భర్త ఉపాధి కోసం  సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడే డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే వివాహిత దగ్గర నిజాముద్దీన్ అనే యువకుడు చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి మనసులో దుర్భుద్ధి కలిగింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. 

Latest Videos

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అతడిని మాటల్లో పెట్టి తలుపులు మూసి వస్తానని చెప్పి, అతడి నుంచి విడిపించుకుంది. అనంతరం వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొ పురుషాంగాన్ని కోసేసింది. దీంతో యువకుడు నొప్పితో అల్లాడిపోతూ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు. 

కాగా బాధిత మహిళ ఆ పురుషాంగాన్ని ఓ ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకొని నేరుగా పోలీసు స్టేషన్ కు చేరుకుంది. తనపై జరిగిన అత్యాచారయత్నం, తాను చేసిన పనిని వివరించింది. ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మరో వైపు ఆ యువకుడు ఇంటికి చేరుకోగా.. అతడి మామ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించాడు. 

నిందితుడైన యువకుడు దీనిని ఖండించాడు. అతడు‘జీ న్యూస్’తో మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి ఆ మహిళ వద్ద పని చేస్తున్నాని, మంగళవారం ఆమె తనకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించిందని చెప్పారు. తన నోట్లో రుమాలు పెట్టి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తరువాత పురుషాంగాన్ని కోసిందని తెలిపారు. తాను స్పృహలోకి వచ్చిన తరువత ఈ విషయం తెలిసిందని అన్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు ఇరువర్గాలను విచారిస్తున్నారు.

click me!