వీడీ సావర్కర్‌కు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు

By Mahesh KFirst Published May 28, 2023, 12:46 PM IST
Highlights

వీడీ సావర్కర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్‌లో వీడీ సావర్కర్ చిత్రపటం ముందు నిలబడి నివాళి అర్పించారు. ఈ రోజు వీడీ సావర్కర్ జయంతి. ఇదే రోజు నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం.
 

న్యూఢిల్లీ: ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో కొత్త పార్లమెంటును ప్రారంభించారు. ఇదే రోజు వీడీ సావర్కర్ జయంతి కూడా. దీంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాల్‌లో వీడీ సావర్కర్ చిత్రపటానికి ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పించారు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ పాత పార్లమెంటులోని సెంట్రల్ హాల్‌లో వీడీ సావర్కర్ చిత్రపటానికి పుష్పగుచ్ఛంతో నివాళి అర్పించారు.

ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా వీడీ సావర్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీలో ట్వీట్ చేశారు. వీడీ సావర్కర్ ఆయన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల గుండెల్లో దేశ భక్తి ద్వీపాలను వెలిగించారని తెలిపారు. వీడీ సావర్కర్ దేశ భక్తి, త్యాగం, పట్టుదల ప్రశంసనార్హం అని వివరించారు. అవి రానున్న మరెన్నో ఏళ్లు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.

Also Read: కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మంత్రిత్వ శాఖలపై ఉత్కంఠ.. హోం శాఖ ఆయనకేనా?

మహారాష్ట్రంలో 1883లో వీడీ సావర్కర్ జన్మించారు. హిందుత్వ అనే పదాన్ని తొలిసారిగా కాయిన్ చేసిన వ్యక్తి వీడీ సావర్కర్. హిందూత్వ ఆలోచనలను కలిగి ఉన్నవారు సావర్కర్‌ను ఒక హీరోగా చూస్తారు.

కొత్త  పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఆదివారం నాడు  ఉదయం  ప్రారంభించారు.  కొత్త  పార్లమెంట్    భవన  ప్రారంభోత్సవ కార్యక్రమం  ఇవాళ   ఉదయం  07:15  గంటల నుండి  ప్రారంభమైంది. ఇవాళ  ఉదయం  తొమ్మిది గంటలకు  స్పీకర్ చాంబర్ సమీపంలో  రాజదండాన్ని  ప్రధాని నరేంద్ర మోడీ  ప్రతిష్టించారు. 
కొత్త  పార్లమెంట్  భవనం ప్రారంభోత్సవం  కార్యక్రమంలో  పలువురు  కేంద్ర మంత్రులు , పలు  రాష్ట్రాల  ముఖ్యమంత్రులు  పాల్గొన్నారు. కొత్త  పార్లమెంట్  భవన  నిర్మాణ  పనుల్లో  పాల్గొన్న  కార్మికులను  ప్రధాని నరేంద్ర మోడీ  సత్కరించారు. 

click me!