ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

First Published 23, Sep 2018, 6:42 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని నరేంద్రమోడీ రాంచీలో ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. దేశంలో నిరుపేదలకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వరమని ప్రధాని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని నరేంద్రమోడీ రాంచీలో ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. దేశంలో నిరుపేదలకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వరమని ప్రధాని అన్నారు.

ఈ తరహా భారీ హెల్త్‌కేర్ కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని అమలు చేయగలిగిందని చెప్పారు. దేశంలో 50 కోట్ల మంది పేదల ఆశీస్సులతో అధికారుల బృందం రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతుందన్నారు.

దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేరాయన్నారు. గరీబీ హఠావో అని చెప్పిన కాంగ్రెస్  నేతలు పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని కాంగ్రెస్‌‌ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. కుల, మత విచక్షణ లేకుండా అందరికీ అభివృద్ధి అందాలనే ఉద్దేశ్యంతోనే ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం చుట్టామన్నారు.

Last Updated 23, Sep 2018, 6:42 PM IST