నడిసంద్రంలో భారత నేవీ కమాండర్.. రంగంలోకి దిగిన భారత్, ఆస్ట్రేలియా

sivanagaprasad kodati |  
Published : Sep 23, 2018, 06:33 AM IST
నడిసంద్రంలో భారత నేవీ కమాండర్.. రంగంలోకి దిగిన భారత్, ఆస్ట్రేలియా

సారాంశం

ఫ్రాన్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఇండియన్ నేవీ కమాండర్ అభిలాష్ టామీ హిందూ మహా సముద్రంలో చిక్కుకుపోయారు.

ఫ్రాన్స్‌లో జరిగే గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఇండియన్ నేవీ కమాండర్ అభిలాష్ టామీ హిందూ మహా సముద్రంలో చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణిస్తున్న సెయిలింగ్ బోట్ వాతావరణం అనుకూలించకపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయింది.

ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాకు 1900 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. వెంటనే ఐఎన్ఎస్ సత్పూరను ఆ ప్రాంతానికి పంపింది.. మరోవైపు ఆస్ట్రేలియా రెస్క్యూ కో-ఆర్డినేషన్ అధికారులు కూడా టామీ జాడ కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu