దేశంలో మళ్లీ లాక్‌డౌన్ వుండదు... కానీ : ప్రధాని మోడీ ప్రకటన

By Siva KodatiFirst Published Apr 8, 2021, 8:33 PM IST
Highlights

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వుండదని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో కరోనా తీవ్రత అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వుండదని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో కరోనా తీవ్రత అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వైరస్‌ను కట్టడి చేసే చర్యలపై సమీక్ష జరిపారు. వ్యాక్సిన్ డోసులు పెంచాలని అన్ని రాష్ట్రాలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చాయి. అనంతరం నరేంద్రమోడీ మాట్లాడుతూ... కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.

రాష్ట్రాలు ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. దేశంలో పరిస్ధితి చాలా సీరియస్‌గా వుందన్న ఆయన... కరోనా కేసుల్లో పీక్ స్టేజీ దాటిపోయామని వెల్లడించారు.

కోవిడ్‌పై యుద్ధ ప్రాతిపదికన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని... కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ప్రత్యామ్నాయమని మోడీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్‌లలో మొదటి దశ కంటే పరిస్ధితులు తీవ్రంగా వున్నాయని  ప్రధాని అన్నారు. 

పెరుగుతున్న కేసుల్ని చూసి భయపడొద్దన్న ఆయన... టెస్టుల సంఖ్యను పెంచాలని సీఎంకు సూచించారు. అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షలను కూడా భారీగా పెంచాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్‌పై ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని... జనం కరోనాను సీరియస్‌గా  తీసుకోవట్లేదని ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేదని.. రాష్ట్రాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము వరకు కర్ఫ్యూ పెడితే మంచిదని ప్రధాని అభిప్రాయపడ్డారు.

నైట్ కర్ఫ్యూను కరోనా కర్ఫ్యూగా పిలుద్దామని మోడీ చెప్పారు. ఏప్రిల్ 11 నుంచి 11 వరకు టీకా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. 45 ఏళ్లు దాటిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. 

click me!