రైతుల ఆందోళన: మోడీ అత్యవసర సమావేశం

By Siva KodatiFirst Published Dec 5, 2020, 3:14 PM IST
Highlights

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉదృతంగా సాగుతోంది. రోజులు గడుస్తున్నా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శనివారం ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌తో అత్యవసరంగా భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా.. రైతుల డిమాండ్ల గురించి కేంద్ర మంత్రులు మోడీతో చర్చించారు. నూతన వ్యవసాయ చట్టాల పట్ల అన్నదాతల అభ్యంతరాలను ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను సవరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రైతుల డిమాండ్లకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా అన్నదాతలకు భరోసా కల్పించేలా కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాకుండా విద్యుత్‌ బిల్లులపై రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకునే అంశాన్ని మోడీ సర్కారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది

click me!