మోడీకి స్వంత బైక్‌ కూడ లేదు, ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Published : Sep 19, 2018, 11:17 AM IST
మోడీకి స్వంత బైక్‌ కూడ లేదు, ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి  స్వంత కారు కూడ లేదు.  ఆయన ఆస్తుల విలువ కేవలం రెండున్నర కోట్ల కంటే తక్కువగా ఉంటుందని పీఎంవో ప్రకటించింది. 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి  స్వంత కారు కూడ లేదు.  ఆయన ఆస్తుల విలువ కేవలం రెండున్నర కోట్ల కంటే తక్కువగా ఉంటుందని పీఎంవో ప్రకటించింది.  వివిధ భ్యాంకుల్లో కోటి రూపాయాల నగదు ఉంటే.. మోడీ వద్ద రూ. 50వేలు ఉందని పీఎంఓ ప్రకటించింది.

ప్రధానమంత్రి మోడీకి ఏ మేరకు ఆస్తులున్నాయో అనే విషయమై   ఆసక్తి ఉంటుంది. అయితే మోడీకి కనీసం స్వంత కారు గానీ, బైక్ కానీ లేవని  పీఎంఓ తేల్చి చెప్పింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి  మోడీ వద్ద రూ. 48,944 నగదు ఉంది. గాంధీనగర్ స్టేట్ బ్యాంకులో రూ. 11,29,690 నగదు డిపాజిట్లు ఉన్నాయని పీఏంఓ ప్రకటించింది.

మరో ఎస్బీఐలో  రూ.1,07,96,288 కోట్లు ఉన్నాయని ప్రకటించింది. ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రా బాండ్ రూ.20వేలు ఉన్నట్టు పేర్కొంది. జాతీయ పొదుపు పత్రం బాండ్ విలువ రూ. 20వేలుగా ఉన్నట్టు పీఎంఓ ప్రకటించింది.ఎల్ఐసీ పాలసీలు రూ.1,59,281 ఉన్నాయని పీఎంఓ అధికారులు తేల్చి చెప్పారు. మరో వైపు మోడీ వద్ద  నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయని  పీఎంఓ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?