ప్రణయ్ లాగే శంకర్ ది కూడా పరువు హత్యే...

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 7:14 PM IST
Highlights

పాపం...ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకుని ఆమె తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు ప్రణయ్. మిర్యాలగూడలో జరిగిన ఈ పరువుహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దళిత యువకుడు ప్రణయ్ తన కూతురు అమృతను పెళ్లి చేసుకోవడాన్ని సహించలేక పోయిన మారుతిరావు దారుణానికి పాల్పడ్డాడు. కిరాయి హంతకుల చేత ప్రణయ్ ని అత్యంత దారుణంగా చంపించాడు. నడిరోడ్డుపైనే ప్రణయ్ హత్య జరగడం, హత్య తర్వాత అమృత తన తండ్రిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ప్రస్తుతం మారుతిరావుతో పాటు నిందితులందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సేమ్ టు సేమ్ ఇలాగే 2016 లో తమిళనాడులో పరువు హత్య జరిగింది. తన కూతురిని దళిత యువకుడు ప్రేమించడమే కాకుండా తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయిన తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రణయ్ హత్య గురించి తెలుసుకున్న ఆ బాధితురాలు స్పందించారు. తన భర్త హత్య ఎలా జరిగిందో గుర్తుచేసుకున్నారు.

తమిళనాడు తిరుపూరు జిల్లాకు చెందిన శంకర్, కౌసల్యలు కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే వీరు పెళ్లి చేసుకోడాన్ని అవమానంగా భావించిన కౌసల్య తండ్రి పట్టపగలే అతి దారుణంగా శంకర్ ని కత్తులతో నరికి చంపాడు. ఈ దృశ్యాలు కూడా సిసిటివి లో రికార్డవడం, మీడియాలో ప్రసారమవడంతో ఈ హత్య తమిళనాడు సంచలనంగా మారింది. అయితే తన భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష పడేవరకు బాధితురాలు కౌసల్య పొరాడింది. అంతేకాకుండా ఇంకా కులరహిత సమాజం కోసం ఆమె పోరాటం చేస్తూనే ఉన్నారు.

తాజాగా ప్రణయ్ హత్యపై కూడా కౌసల్య స్పందించారు. ఇలాంటి హత్యలు జరక్కుండా ఉండాలంటే కుల వ్యవస్థను సమాజం నుండి తరిమేయాలని ఆమె పేర్కొన్నారు. తమ ఇంట్లోని అబ్బాయిలు కులాంతరవివాహం చేసుకుంటే అంతలా పట్టించుకోని తల్లిదండ్రులు అమ్మాయిలు చేసుకుంటే మాత్రం ఎంతకైనా తెగిస్తారని తెలిపారు. భారతీయ కుటుంబ వ్యవస్థలోనే కులతత్వం, మహిళలను చిన్న చూపు చూడటం వంటివి ఉన్నాయని కౌసల్య మండిపడ్డారు. ఈ పరువు హత్యలపై కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కౌసల్య సూచించారు. తనలాగే భర్తను కోల్పోయిన అమృతకు ఆమె సానుభూతిని ప్రకటించారు.
 
click me!