
జపాన్ పర్యటనకు బయల్దేరారు ప్రధాని నరేంద్ర మోడీ (modi japan tour). రేపు టోక్యోకు చేరుకున్నారు మోడీ. జపాన్‌లో జరిగే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ (indo pacific economic framework) కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. జపాన్ వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. మొత్తంగా జపాన్ పర్యటనలో భాగంగా 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు మోడీ. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో కలిసి క్వాడ్ (quad leaders summit) సమావేశానికి హాజరవుతారు. ఈ పర్యటనలో ఇండియా జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా చర్చలు జరుపుతామన్నారు మోడీ.
ALso Read:ప్రజలే మాకు మొదటి ప్రాధాన్యత.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోడీ
ఇకపోతే.. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నేపాల్‌లో (modi nepal tour) పర్యటించారు. భారత్- నేపాల్ స్నేహబంధం (india nepal relations) బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని ప్రధాని అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి ఒకే కుటుంబంగా మారుస్తోందన్నారు.
అంతకుముందు మే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ మూడు రోజులపాటు యూరప్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోడీ తొలుత జర్మనీ చేరుకున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షాల్జ్‌తో భేటీ అయ్యారు మోదీ. అనంతరం ఫ్రాన్స్, డెన్మార్క్‌లలో పర్యటించిన ఆయన పలు కీలక భేటీల్లో పాల్గొన్నారు.