భారత్‌లోనూ బూస్టర్ డోస్.. ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి: ప్రధాని మోడీ కీలక ప్రకటన

Siva Kodati |  
Published : Dec 25, 2021, 10:10 PM ISTUpdated : Dec 25, 2021, 10:18 PM IST
భారత్‌లోనూ బూస్టర్ డోస్.. ముందుగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి: ప్రధాని మోడీ కీలక ప్రకటన

సారాంశం

ఒమిక్రాన్ (omicron) విషయంలో అప్రమత్తంగా వుండాలని దేశ ప్రజలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi). త్వరలోనే నాజల్, డీఎన్ఏ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని.. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ వేస్తామని చెప్పారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు. జనవరి 10 నుంచి హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ (Booster Dose) ఇస్తామని మోడీ ప్రకటించారు. 

ఒమిక్రాన్ (omicron) విషయంలో అప్రమత్తంగా వుండాలని దేశ ప్రజలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) . శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఒమిక్రాన్‌తో ప్రపంచదేశాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. మనదేశంలోనూ ఒమిక్రాన్ వ్యాపిస్తోందని.. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మోడీ సూచించారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని.. కరోనాను (coronavirus) భారత్ సమర్ధవంతంగా ఎదుర్కోంటోందని ప్రధాని స్పష్టం చేశారు. 

దేశంలో 18 లక్షల ఐసోలేషన్ బెడ్లు వున్నాయని.. పిల్లల కోసం ప్రత్యేకంగా బెడ్లు వున్నాయని మోడీ తెలిపారు. అలాగే 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు వున్నాయని.. దేశంలో జనవరి 26 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో అర్హులైన 61 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని మోడీ తెలిపారు. త్వరలోనే నాజల్, డీఎన్ఏ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని.. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ వేస్తామని చెప్పారు. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు. జనవరి 10 నుంచి హెల్త్ వర్కర్లకు బూస్టర్ డోస్ (Booster Dose) ఇస్తామని మోడీ ప్రకటించారు.

ALso Read:12 ఏళ్లు దాటిన పిల్లలకు ‘‘కోవాగ్జిన్’’.. భారత్ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతి

ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయని.. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నామని మోడీ చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్‌ డోసు అందిస్తామని... ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వేగంగా సాగుతోందని ప్రధాని ప్రశంసించారు. దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరతా లేదు అని మోడీ పేర్కొన్నారు. 

ఒమిక్రాన్‌ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు అన్న ప్రధాని... అనేక రాష్ట్రాల్లో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయిందని స్పష్టం  చేశారు. కొత్త సంవత్సరం కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నామని.. కానీ ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం మరిచిపోవద్దని.. వైద్య సిబ్బంది కఠోర శ్రమవల్లే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని ప్రధాని పేర్కొన్నారు. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్‌ ఉద్యమం కొనసాగుతోంది అని ప్రధాని మోడీ చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?