12 ఏళ్లు దాటిన పిల్లలకు ‘‘కోవాగ్జిన్’’.. భారత్ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతి

By Siva KodatiFirst Published Dec 25, 2021, 9:13 PM IST
Highlights

దేశంలో ఒమిక్రాన్ (omicron) చాపకింద నీరులా విస్తరిస్తోన్న నేపథ్యంలో మరోసారి థర్డ్ వేవ్ (third wave) తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. చిన్నారులకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ‘‘కోవాగ్జిన్’’ వేసేందుకు డీసీజీఐ (dcgi) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. 

దేశంలో ఒమిక్రాన్ (omicron) చాపకింద నీరులా విస్తరిస్తోన్న నేపథ్యంలో మరోసారి థర్డ్ వేవ్ (third wave) తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. చిన్నారులకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ‘‘కోవాగ్జిన్’’ వేసేందుకు డీసీజీఐ (dcgi) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. 12-18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించింది. 

ALso Read:గుడ్‌న్యూస్: 18‌ ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్, కోవాగ్జిన్‌కి గ్రీన్‌సిగ్నల్

కాగా.. కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సిన్ ను మూడు రకాల వయస్సు పిల్లలపై ప్రయోగించారు. 12 -18 ఏళ్లు, 6-12 ఏళ్లు, 2-6 ఏళ్ల మధ్య పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారు.తొలుత 12-18 ఏళ్ల  పిల్లలపై ఈ వ్యాక్సిన్ ను పరిశీలించారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో చిన్నారులపై కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశారు. ఈ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ dcgi కి పంపింది. సుమారు 525 మంది చిన్నారులపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించారు.


 

click me!