Maharashtra update: బలపరీక్షా, రాజీనామానా.... మోడీ-షా వ్యూహమేంటీ

By sivanagaprasad KodatiFirst Published Nov 26, 2019, 3:06 PM IST
Highlights

మహారాష్ట్రలో రాజకీయాలు అనుహ్య మలుపు తిరుతున్నాయి. ఎవ్వరూ ఊహించిన విధంగా డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో కలకలం రేగుతోంది. 

మహారాష్ట్రలో రాజకీయాలు అనుహ్య మలుపు తిరుతున్నాయి. ఎవ్వరూ ఊహించిన విధంగా డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయడంతో కలకలం రేగుతోంది. బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

ఈ క్రమంలో బీజేపీ బలపరీక్షను ఎదుర్కొంటుందా లేక చేతులేత్తేస్తుందా అని దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే మోడీ-అమిత్ షాలు అంత తేలిగ్గా ఓటమిని అంగీకరించే వారు కదా.. ఖచ్చితంగా తాము చేయాల్సింది చేస్తారు.

ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం పార్లమెంట్‌లో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో రాజీనామా చేయించాలా లేక మరేదైనా వ్యూహం రచించాలా అన్న దానిపై ఇద్దరూ చర్చించారు.

Also Read:ఫడ్నవీస్‌కు షాక్: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా

అయితే ఇద్దరు నేతలు ఏ నిర్ణయానికి వచ్చారనే దానిపై సమాచారం లేకపోయినప్పటికీ.. వీరి నిర్ణయం ఫడ్నవీస్‌కు తెలియజేసినట్లుగా సమాచారం. మరికొద్దిసేపట్లో ఫడ్నవీస్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

మీడియా ముందే ఆయన తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం విశ్వాస పరీక్ష నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా భేటీ కానున్నారు. ముంబైలోని పలు హోటళ్లలో ఉన్న వీరంతా ఒక చోటికి చేరుకోనున్నారు. అ

జిత్ పవార్ రాజీనామా చేయడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృధ్వీ రాజ్ చవాన్ స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం లేకపోయినా చట్టవిరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

న్సీపీ నేత అజిత్ పవార్  డిప్యూటీ సీఎం పదవికి మంగళవారం నాడు రాజీనామా చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఈ నెల 23వ తేదీన ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చారని అజిత్ పవార్ ప్రకటించారు

Also Read:మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఎవరు?: ఈ ఆరుగురికే ఛాన్స్

అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరిగి శరద్ పవార్  వద్దకు చేరారు. మరోవైపు ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు బలాన్నినిరూపించుకోవాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను ఆదేశించింది.

click me!