డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు.
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి మంగళవారం నాడు రాజీనామా చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.
Al;so read:ఫడ్నవీస్ రేపే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలి: సుప్రీంకోర్టు
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఈ నెల 23వ తేదీన ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చారని అజిత్ పవార్ ప్రకటించారు.
undefined
Also read:మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఎవరు?: ఈ ఆరుగురికే ఛాన్స్
అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరిగి శరద్ పవార్ వద్దకు చేరారు. మరోవైపు ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు బలాన్నినిరూపించుకోవాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను ఆదేశించింది.
సోమవారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ ముందు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరేడ్ నిర్వహించారు.సుమారు 162 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని గవర్నర్ ముందు ఎమ్మెల్యేలు పరేడ్ సందర్భంగా చెప్పారు.
మరో వైపు ఈ నెల 27వ తేదీ సాయంత్రం లోపుగా ఫడ్నవీస్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలి. ఈ తరుణంలో ఎన్సీపీ నేతలు అజిత్ పవార్‌తో టచ్‌లో ఉన్నారు. పార్టీలోకి తిరిగి రావాలని కోరుతున్నారు.
ఈ తరుణంలో ఇవాళ ఉదయం కూడ ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ తో ఎన్సీపీ నేతలు మరోసారి చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత అజిత్ పవార్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో చర్చించారు.
సీఎం ఫడ్నవీస్‌తో చర్చించిన తర్వాత డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు. మంగళవారం నాడు మధ్యాహ్నం మూడున్నర గంటలకు సీఎం ఫడ్నవీస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఫడ్నవీస్ మీడియా సమావేశానికి అత్యంత ప్రాధాన్యత నెలకొంది.