PM Modi: ఓ వైపు పోలింగ్.. మరోవైపు ప్రచారం.. రామ మందిరంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

By Rajesh Karampoori  |  First Published Apr 19, 2024, 5:40 PM IST

PM Modi: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం మధ్యప్రదేశ్ లోని దామోలో పర్యటించారు. అక్కడి  ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడూ రామ మందిరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
 


PM Modi: లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ దశ స్థానాల్లో  ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా నేడు మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..   రామ మందిరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందువులకు ఇతర వర్గీయులకు మధ్య యుద్దం జరుగుతూ ఉండేదన్నారు. అదే రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వ్యవహారంలో నిత్యం ఘర్షణ వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలకడం కోసం సుప్రీం కోర్టు చేరినట్టు తెలిపారు. 

ఈ సమయంలో హిందువుల పక్షాన న్యాయం ఉందని గుర్తించిన న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించిందని అన్నారు. ఎన్నో దశాబ్దాలు సాగిన పోరులో సుప్రీం కోర్టు ఆదేశాలతో ముగిసిందని పేర్కొన్నారు. నేడు  అయోధ్యలో రామమందిరాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పరిరక్షిస్తోందని, ప్రారంభోత్సవ సమయంలో ఎలాంటి కుట్రలు, ద్వేషాలు, బేషజాలు లేకుండా ట్రస్ట్ అందర్ని ఆహ్వానించిందని  ట్రస్ట్ గురించి తెలిపారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అన్సారీ కుటుంబం గురించి మాట్లాడుతూ..  అయోధ్యలోని రామ మందిరానికి వ్యతిరేకంగా అన్సారీ కుటుంబం రెండు తరాలుగా న్యాయ పోరాటం చేసిందనీ, అయితే రామాలయానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో ప్రజలు దానిని అంగీకరించారు. రామ ప్రాణప్రతిష్ట సందర్భంలో రామమందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారిని కూడా ఆహ్వానించారని గుర్తు చేశారు ప్రధాని మోడీ. అలాగే.. కాంగ్రెస్ తో పాటు పలువురికి అందించిన ఆహ్వానాల గురించి వాటిని తిరస్కరించిన పరిస్థితులను మరోసారి ప్రజలకు గుర్తు చేశారు.
 
రానున్న ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే పెద్ద శక్తిగా మార్చేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా యుద్ధ మేఘాలు ఎలా కమ్ముకుంటున్నాయో చూస్తారనీ, ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు భారతదేశంలో యుద్ధ ప్రాతిపదికన శాంతియుతంగా  ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన పనిని వివరిస్తూ..గత 10 ఏళ్లలో సుస్థిర ప్రభుత్వం.. దేశప్రజల ప్రయోజనాల కోసం ఎలా పనిచేస్తుందో చూశామని ప్రధాని మోదీ అన్నారు. కరోనా సంక్షోభం సమయంలోనూ బీజేపీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందనీ, దేశంలోని ప్రతి పౌరుడ్ని రక్షించిందని తెలిపారు. అలాగే.. ప్రపంచ దేశాలకు భారత్ అండగా నిలిచిందని తెలిపారు.  

Latest Videos

బీజేపీ ప్రభుత్వం దేశానికి ముందు అనే సిద్ధాంతంతో పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎవరినీ లొంగదీసుకోవడం లేదని, ఎవరి ముందు తలవంచడం లేదన్నారు. భారత్‌కు చవకగా చమురు లభించాలి, కాబట్టి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నామనీ,  భారతీయ రైతులకు సరిపడా ఎరువులు అందేలా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నామని అన్నారు.   అదే సమయంలో ప్రధాని మోడీ  పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. నేడు పాక్ ఆహారధాన్యాల కోసం కొట్టుమిట్టాడుతోందని, ప్రపంచంలోని అనేక దేశాల్లో చాలా దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నాయనీ, చాలా దేశాలు ఆర్ధికంగా దివాళా తీస్తున్నాయని పేర్కొన్నారు. మన పొరుగుదేశం ఉగ్రవాదాన్ని పెంచిపోషించి.. నేడు ఆహారం కోసం తహతహలాడుతుందని ప్రధాని అన్నారు.

ప్రతిపక్షాలపై టార్గెట్ 

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇండియా కూటమిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. భారతదేశ రక్షణ రంగాన్ని కాంగ్రెస్ బలహీన పరిచిందనీ,  వారు సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడంలో తమ స్వప్రయోజనాలను కూడా చూస్తున్నారని విమర్శించారు. వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను పొందకుండా ఉండేందుకు వారు తమ శక్తినంతా ఎలా ఉపయోగించారో దేశం మొత్తం చూసిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే తేజస్ యుద్ధ విమానం కూడా మన రక్షణ వ్యవస్థలో ఉండేవి కావని అన్నారు.  

తీర్మానం లేఖలో బిజెపి చేసిన వాగ్దానాలను మరోసారి పునరుద్ఘాటించారు. ప్రతి కుటుంబానికి రేషన్, చికిత్స ఖర్చు ముఖ్యమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, వచ్చే 5 సంవత్సరాలకు ఉచిత రేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ ఉచిత రేషన్ తో పాటు గ్యాస్ కనెక్షన్లు కూడా అందిస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్ యోజన పేదలను లక్షల రూపాయల ఖర్చు నుండి కూడా కాపాడుతుందనీ, మన దేశంలో పేదలతో పాటు 70 ఏళ్లు పైబడిన వారెవరైనా.. ఉచిత చికిత్స పథకం ప్రయోజనం పొందుతారని మోదీ హామీ ఇచ్చారు.
 

click me!