సుప్రీంకోర్టు తీర్పును గెలుపోటములుగా చూడవద్దని, రామభక్తి, రహీం భక్తి కాదని.. దేశభక్తి భావాన్ని బలోపేతం చేయాలని మోడీ పిలుపునిచ్చారు.
అయోధ్యలోని రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మోడీ వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇవాళ్టీ పరిస్థితులే నిదర్శనమన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును గెలుపోటములుగా చూడవద్దని, రామభక్తి, రహీం భక్తి కాదని.. దేశభక్తి భావాన్ని బలోపేతం చేయాలని మోడీ పిలుపునిచ్చారు. దేశప్రజలంతా శాంతి, ఐకమత్యంతో ఉండాలని.. అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలోనే చారిత్రాత్మకమైనదని మోడీ వెల్లడించారు.
undefined
దశాబ్ధాలుగా వస్తున్న కేసుకు ముగింపు పడిందని..ఈ రోజు ప్రజాస్వామ్య శక్తిని నిరూపించిన రోజన్నారు. సంక్లిష్టమైన న్యాయబద్ధంగా పరిష్కరించొచ్చని సుప్రీంకోర్టు రుజువు చేసిందని ప్రధాని గుర్తుచేశారు. భారతదేశ న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురిసిందని.. సుప్రీంకోర్టు తీర్పును దేశప్రజలు స్వాగతించారన్నారు.
Also Read:Ayodhya : సోషల్ మీడియాలో చర్చంతా ఆ తీర్ఫుపైనే.. గల్లంతైన మహా రాజకీయం
న్యూఇండియా నిర్మాణానికి సుప్రీం తీర్పు నాంది పలికిందని.. ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిందని ప్రధాని కొనియాడారు. తీర్పు సందర్భంగా ప్రజలు చాలా సంయమనం పాటించారని.. ఇందుకు దేశ ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.
మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడ కొట్టేసిన సుప్రీం కోర్టు. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖాళీ ప్రదేశం బాబ్రీ మసీదును కట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
Also Read:వరల్డ్ టాప్-10 ట్విట్టర్ ట్రెండ్స్‌లో #Ayodhya Verdict
యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును ఈరోజు వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ప్రకటించింది.
శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది.
కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు.