ప్రణబ్ ముఖర్జీ మృతి: నివాళులర్పించిన ప్రముఖులు

By narsimha lodeFirst Published Sep 1, 2020, 11:04 AM IST
Highlights

 మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు మంగళవారం నాడు నివాళులర్పించారు.

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు మంగళవారం నాడు నివాళులర్పించారు.

అనారోగ్యంతో గత నెల 10వ తేదీన ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన మరణించారు.సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 9 గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుండి ప్రణబ్ ముఖర్జీ పార్థీవదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.

also read:ప్రణబ్ ముఖర్జీ మృతి: రేపు ఢిల్లీలో అంత్యక్రియలు

ప్రణబ్ పార్థీవ దేహానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఒం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ , కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల నేతలు  ప్రణబ్ పార్థీవ  దేహానికి నివాళులర్పించారు.

ప్రణబ్ కుటుంబసభ్యులను ప్రధాని మోడీ ఓదార్చారు. ఇవాాళ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం భౌతిక కాయాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రణబ్ అంత్యక్రియలను నిర్వహిస్తారు.
 

click me!