బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్: ఉగ్రవాది అరిజ్‌ఖాన్‌కి మరణశిక్ష

By narsimha lodeFirst Published Mar 15, 2021, 6:08 PM IST
Highlights

బాట్లా ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం నాడు అరిజ్ ఖాన్ కు ఉరిశిక్షను విధించింది.12 ఏళ్ల క్రితం దేశంలో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
 

న్యూఢిల్లీ: బాట్లా ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం నాడు అరిజ్ ఖాన్ కు ఉరిశిక్షను విధించింది.12 ఏళ్ల క్రితం దేశంలో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

2018లో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ చోటు చేసుకొంది. అరిజ్ ఖాన్ ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాది.డిల్లీకి చెందిన పోలీసు అధికారి మోహన్ చంద్ శర్మను అరిజ్ ఖాన్ చంపాడు. ఈ ఘటన జరిగిన దశాబ్దం తర్వాత అరిజ్ ఖాన్ కు కోర్టు మరణశిక్ష విధించింది.

ఇది కేవలం హత్య కాదు, న్యాయం యొక్క రక్షకుడైన చట్ట అమలు అధికారి హత్య అని పోలీసుల తరపున న్యాయవాది కోర్టు ముందు వాదించారు.అయితే అరిజ్ ఖాన్ తరపు న్యాయవాది మాత్రం ఈ మరణశిక్షను వ్యతిరేకించారు. ఈ నెల 8వ తేదీన అరిజ్ ఖాన్ అతని సహచరులు పోలీస్ అధికారి హత్యకు కారణమయ్యారని కోర్టు నిర్ధారించింది. 

2008లో బాట్లహౌస్ ఎన్ కౌంటర్ సందర్భంగా పోలీసుల ప్రత్యేక సెల్ కు చెందిన ఇన్స్ పెక్టర్ శర్మ మరణించారు.ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్ కు 2013 జూలైలో జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై ఆయన అప్పీల్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది.


 

click me!