మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోదీ.. అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా కాన్వాయ్ ఆపిన ప్రధాని.. వీడియో

By Sumanth KanukulaFirst Published Nov 9, 2022, 3:10 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌ వెళ్లేందుకు అవకాశం కల్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌ వెళ్లేందుకు అవకాశం కల్పించారు. వివరాలు..  హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ రోజు ఆయన కాంగ్రా జిల్లాలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన సభా వేదిక వద్దకు వెళ్తుండగా.. చంబి అంబులెన్స్ వెళ్తుందని తెలిసి ప్రధాని తన కాన్వాయ్‌ను నిలిపివేయించారు. 

అంబులెన్స్ వెళ్లిపోగానే ప్రధాని మోదీ కాన్వాయ్ అక్కడి నుంచి బయలుదేరింది. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అంబులెన్స్ వేగంగా వెళ్లేందుకు వీలుగా.. ప్రధాని మోదీ  తన కాన్వాయ్‌ను కొన్ని సెకన్ల పాటు నిలిపి ఉంచారు. అయితే ప్రధాని మోదీ ఈ విధంగా మానవీయ కోణాన్ని చాటుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  
 

| Prime Minister Narendra Modi stopped his convoy to let an Ambulance pass in Chambi, Himachal Pradesh pic.twitter.com/xn3OGnAOMT

— ANI (@ANI)

 

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 30వ తేదీన అహ్మదాబాద్‌‌లో కార్యక్రమం ముగించుకుని రోడ్డు మార్గంలో గాంధీనగర్‌కు బయలుదేరారు. అయితే అంబులెన్స్‌కు దారి  ఇచ్చేందుకు మోదీ కాన్వాయ్ కొద్దిసేపు ఆగింది. ప్రధాని కాన్వాయ్‌లోని వాహనాలు అంబులెన్స్ దారి ఇచ్చేందుకు వీలుగా రోడ్డు పక్కకు జరిగాయి. అంబులెన్స్ ముందుకు సాగిపోయిన.. మోదీ కాన్వాయ్ అదే మార్గంలో ప్రయాణాన్ని సాగించింది. 

click me!