ప్రైవేట్ జాబ్ చేస్తేనే గవర్నమెంట్ ఉద్యోగం... గోవా సర్కార్ కొత్త రూల్

By Siva KodatiFirst Published Nov 9, 2022, 3:02 PM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ఏడాది పాటు ప్రైవేట్ రంగంలో జాబ్ చేయాలంటూ గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన చర్చనీయాంశమైంది. దీనిపై నిపుణులు, మేధావులు విమర్శలు చేస్తున్నారు. 
 

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొత్త నిబంధన ప్రకారం.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఏడాది పాటు ఏదైనా ప్రైవేట్ సంస్థలో పనిచేసి అనుభవం తప్పనిసరి. ఏ మాత్రం అనుభవంలేని వాళ్లనపు నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం వల్ల పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. 

ప్రైవేట్ రంగంలో అనుభవం వుండటం వల్ల ప్రభుత్వానికి నైపుణ్యానికి కలిగిన అభ్యర్ధులు దొరుకుతారని సీఎం వివరించారు. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ రూల్‌ను అమలు చేస్తామని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధులు.. అంతకంటే ముందు ఏడాది పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఉద్యోగాన్ని ఎవరికి వారుగా సంపాదించుకోవాలని .. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర మార్గాల్లో ప్రయత్నించరాదని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై నిపుణులు, మేధావుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సమర్ధిస్తుంటే.. మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. 
 

click me!