Mann Ki Baat: తెలుగు భాష గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

Published : Aug 27, 2023, 01:31 PM IST
  Mann Ki Baat: తెలుగు భాష గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి  తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి  తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఈరోజు మన్‌ కీ బాత్ 104వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రస్తావించారు. సంస్కృతం వలె భారతదేశంలోని ప్రాచీన భాషలలో తెలుగు ఒకటి అని పేర్కొన్నారు. ప్రపంచంలోని పురాతన భాషల్లో సంస్కృతం ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిని అనేక ఆధునిక భాషలకు తల్లి అని కూడా అంటారని పేర్కొన్నారు. 

మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుసంధానం చేయడానికి మన మాతృభాష చాలా శక్తివంతమైన మాధ్యమం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘మన మాతృభాషలో అనుసంధానం  అయినప్పుడు సహజంగానే మన సంస్కృతితో ముడిపడి ఉంటాం. మనం మన సంస్కారాలతో ముడిపడి ఉంటాం. మన ప్రాచీన వైభవంతో అనుసంధానం అవుతాం’’ అని మోదీ పేర్కొన్నారు. 

అదేవిధంగా భారతదేశానికి మరో మాతృభాష, మహిమాన్వితమైన తెలుగు భాష ఉందని అన్నారు. ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తుచేశారు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషా సాహిత్యంలో, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగి ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ తెలుగు వారసత్వాన్ని దేశం మొత్తం పొందేలా అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే