నేను..ఏపీ గవర్నర్ గానా..స్పందించిన కిరణ్ బేడీ

Published : Jan 25, 2019, 10:07 AM IST
నేను..ఏపీ గవర్నర్ గానా..స్పందించిన కిరణ్ బేడీ

సారాంశం

ఏపీ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని నియమించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే.

ఏపీ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని నియమించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ ప్రచారంపై తాజాగా ఆమె స్పందించారు. తనను ఏపీ గవర్నర్ గా నియమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవి కేవలం పుకార్లేనని తేల్చి చెప్పారు.

గురువారం పుదుచ్చేరిలోని తట్జాంచావడిలోని ఆది డ్రావిడర్ సంక్షేమ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులు ఆమెను ఈ విషయంపై ప్రశ్నించగా ఆమె పైవిధంగా పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను లోక్ సభ కు పోటీచేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. తనకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు. పరిపాలనా వ్యవమారాల్లో ఉండాలన్నదే తన కోరిక అని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..