ఇద్దరు కొడుకులను చంపి.. తల్లి ఆత్మహత్య

Published : Jan 25, 2019, 09:42 AM IST
ఇద్దరు కొడుకులను చంపి.. తల్లి ఆత్మహత్య

సారాంశం

ఇద్దరు కొడుకులను గొంతు పిసికి చంపేసి.. ఆ తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది.

ఇద్దరు కొడుకులను గొంతు పిసికి చంపేసి.. ఆ తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మైసూర్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. మైసూర్ కి చెందిన ఆశ(30).. కి భర్త, 8ఏళ్ల వయసుగల ఇద్దరు కవల కుమారులు ఉన్నారు.  భర్త రోజువారీ కూలిపనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కాగా.. గురువారం పనికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి.. భార్య ఆశ, కుమారులు శౌర్య గౌడ, సుప్రీత్ గౌడలు విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనాస్థిలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. ఆశ ముందుగా.. తన ఇద్దరు కొడుకులను గొంతు నులిమి చంపేసి.. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ సూసైడ్ నోట్ కూడా లభించింది. అందులో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. తమ చావులకు ఎవరూ బాధ్యులు కారంటూ ఆమె లేఖలో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలతిపారు. 
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..