ఏపీ, తెలంగాణలమధ్య ఆ పరిస్థితి లేదు: విభజనపై మోదీ కీలక వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published May 4, 2019, 7:59 PM IST
Highlights

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అలాంటి పరిస్థితులో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందన్న మోదీ విభజన జరిగి ఐదేళ్లు గడిచిని ఏపీ, తెలంగాణల మధ్య సామరస్య పరిస్థితి లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి లేదన్నారు. అలాంటి విద్వేష మార్గం అవసరమా అంటూ మోదీ నిలదీశారు.   
 

బీహార్: తెలుగు రాష్ట్రాలపై ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేదంటూ చెప్పుకొచ్చారు. బీహార్ లోని రామ్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్రమోదీ ఏపీ, తెలంగాణల ప్రజలు ఒకరిముఖం ఒకరు చూసుకునే పరిస్థితి లేదన్నారు. 

ఇలాంటి విద్వేషమార్గం అవసరమా అంటూ నిలదీశారు. మాజీప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. మూడు రాష్ట్రాల ప్రజలు ప్రేమతో విడిపోయారని చెప్పుకొచ్చారు. 

బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు విడిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రాలు విడిపోయినా వారంత ఒకరినొకరు గౌరవిస్తూ సంతోషంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. 

కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అలాంటి పరిస్థితులో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందన్న మోదీ విభజన జరిగి ఐదేళ్లు గడిచిని ఏపీ, తెలంగాణల మధ్య సామరస్య పరిస్థితి లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి లేదన్నారు. అలాంటి విద్వేష మార్గం అవసరమా అంటూ మోదీ నిలదీశారు.   
 

click me!