ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ కు అవమానం: చెంపచెల్లుమనిపించిన యువకుడు

Published : May 04, 2019, 06:30 PM IST
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ కు అవమానం: చెంపచెల్లుమనిపించిన యువకుడు

సారాంశం

ఎన్నికల ప్రచారంలో అందరికీ అభివాదం చేస్తున్న కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అందరూ చూస్తుండగా కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనతో కేజ్రీవాల్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 

ఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రాష్ట్రముఖ్యమంత్రి చెంపచెల్లుమనిపించాడు ఓ వ్యక్తి. దీంతో ప్రజలంతా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఎన్నికల ప్రచారంలో అందరికీ అభివాదం చేస్తున్న కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అందరూ చూస్తుండగా కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటనతో కేజ్రీవాల్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 

కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డ ఆగంతకుడిని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఇకపోతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై గతంలోనూ అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. ఇప్పటి వరకు మెుత్తం కేజ్రీవాల్ పై 8సార్లు దాడులు జరిగాయి. 

గతంలో ఇంక్ తోనూ, చెప్పులతోనూ దాడులకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో మరో వ్యక్తి కారంపొడితో దాడికి పాల్పడ్డారు. ఒక సీఎంపై ఇలా దాడులు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రికి భద్రత కల్పించకపోవడంపైనే దాడులు జరుగుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్