ఆ పనిని కొనసాగించడమే నా లక్ష్యం... ఇస్రో కొత్త చైర్మన్ ఎస్ సోమనాథ్

By SumaBala BukkaFirst Published Jan 13, 2022, 8:05 AM IST
Highlights

"వారి నైపుణ్యాలు, ఊహాశక్తిని అంతరిక్ష శాస్త్రంలోని నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయకుండా ఈ గేమ్-ఛేంజర్‌లకు మేము తలుపులు తెరిచాం. ఇది వారికి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో అవకాశాలను విస్తరించుకునేలా సాయపడుతుంది" అని సోమనాథ్ ఆసియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

అంతరిక్ష రంగంలో పెరుగుతున్న వాణిజ్య అవకాశాలను అన్వేషించడానికి దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్రం ప్రారంభించిన కొత్త రంగాలపై, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థపై తమకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందని బుధవారం నాడు ISRO చైర్మన్‌, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ సెక్రటరీగా నియమితులైన S Somanath అన్నారు.

"వారి నైపుణ్యాలు, ఊహాశక్తిని space scienceలోని నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయకుండా ఈ గేమ్-ఛేంజర్‌లకు మేము తలుపులు తెరిచాం. ఇది వారికి దినదినాభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో అవకాశాలను విస్తరించుకునేలా సాయపడుతుంది" అని సోమనాథ్ ఆసియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇలా మీడియాతో ఆయన మాట్లాడడం ఆసియా నెట్ తోనే తొలిసారి.

ఈ రంగంలోకి చాలా స్టార్టప్‌లు వస్తున్నాయి. వాస్తవానికి, rocket manufacture ఇతర లాంచ్ వెహికిల్స్ ను అభివృద్ధి చేయడంలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉపగ్రహాల తయారీ లేదా అసెంబ్లింగ్ విషయంలోనూ ఇదే పరిస్థితి. అయితే ఇలాంటి అవకాశాలను పరిశీలిస్తున్న అనేక మంది యువకులు ఇస్రోతో చర్చలు జరుపుతున్నారని ఆయన చెప్పారు.

"స్పేస్-ఆధారిత డేటా ఆధారంగా అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనేది రిస్క్ తక్కువగా ఉన్న అంశం. ఇదే అనేకమందితో ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది. ఆకర్షిస్తోంది. అంతరిక్ష-ఆధారిత సేవలను అందించే ప్రొవైడర్‌లుగా మారడం కొత్త అవకాశాలకు కిటికీలు తెరుస్తుంది. ఇస్రో వారికి వెన్నుదన్నుగా ఉంటోంది" అని తిరువనంతపురంలోని Director of Vikram Sarabhai Space Centre సోమనాథ్ అన్నారు.

"భారత అంతరిక్ష పరిశోధన, అభివృద్ధికి భిన్నమైన పథాన్ని ఊహించిన శ్రీ విక్రమ్ సారాభాయ్ (ఈ సంవత్సరం విక్రమ్ సారాభాయ్ 50వ వర్ధంతిని దేశం స్మరించుకుంటుంది) అడుగుజాడలను అనుసరిస్తున్నాను. చాలా దేశాలు తమ డిఫెన్స్ పవర్ లోని మరో కోణాన్ని ప్రదర్శించడానికి అంతరిక్షాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ భారతదేశం తన విజయాలను సామాన్యులకు శాస్త్రీయ ప్రయోజనాలను చేరవేయడానికి ఉపయోగించుకుంది. ఇది టెలిమెడిసిన్, దూర విద్యలో వచ్చిన అద్భుతమైన మార్పులు లాంటి కొన్ని ఉదాహరణలతో స్పష్టమవుతుంది.

"ఈ పనిని కొనసాగించడమే నా లక్ష్యం. దేశంలో అంతరిక్ష సాంకేతికత మద్దతు అవసరమయ్యే అనేక విభాగాలు ఉన్నాయి. ఈ రంగాలలో వినియోగదారు ఆధారిత కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇస్రో వారితో పరస్పర చర్యలను మెరుగుపరుస్తుంది" అని సోమనాథ్ అన్నారు.

"ప్రస్తుతం ISRO దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో ప్రత్యక్ష సంబంధంలో ఉంది. కానీ మనకు పరోక్షంగా కాంటాక్ట్ లో ఉన్న మరో 80 శాఖలున్నాయి. వాటన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకురావడం, దేశంలోని సామాన్య ప్రజల జీవితాలను బాగుపరిచే ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై నా దృష్టి ఉంటుంది" అన్నారాయన.

"మేము సేవా రంగంలో మరింత కంట్రిబ్యూట్ చేస్తాం. డేటా-ఆధారిత కమ్యూనికేషన్ రంగంలో కూడా చేస్తాం. ఇది ప్రాధాన్యతా రంగాలలో ఒకటి. అందుబాటులో ఉన్న ట్రాన్స్‌పాండర్‌లను ఉపయోగించి ఇంకా చాలా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే లాస్ట్ మైల్ కనెక్టివిటీ పొందేందుకు సరిపోలే డౌన్‌లింక్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలి"  అన్నారు. "అదే విధంగా, రిమోట్ సెన్సింగ్‌కు తక్షణ శ్రద్ధ అవసరం. ఎక్కువ జీవితకాలం ఉన్న భారీ ఉపగ్రహాలతో పాటు, వేగవంతమైన వేగంతో సందర్శించగల చిన్న ఉపగ్రహాల సముదాయాన్ని కూడా కలిగి ఉండాలి. ఇది తదుపరి సిరీస్‌ని వేగవంతంగా అప్‌గ్రేడ్ చేయడానికి సహాయపడుతుంది" అన్నారు.

click me!