డిజిటల్ మీడియాలో ఏసియా నెట్ న్యూస్ ప్రభంజనం... 110శాతం వృద్దితో దేశంలోనే టాప్ 

By Arun Kumar P  |  First Published May 22, 2024, 4:14 PM IST

మీడియా రంగంలో ఏసియా నెట్ ఓ సంచలనం... డిజిటల్ మీడియా రంగంలో అయితే ప్రభంజనం. తాజాగా ఏసియా నెట్ న్యూస్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ అద్భుత వృద్దిరేటుతో దూసుకుపోతోంది. 


ఏసియానెట్ న్యూస్... డిజిటల్ మీడియా రంగంలో ప్రభంజనం సృష్టిస్తోంది. యావత్ భారత ప్రజల అభిమానాన్ని చూరగొంటూ దినదినాభివృద్దిలో ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తాజాగా డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్  విభాగంలో ఏసియా నెట్ 110 శాతం ఆడియన్స్ వృద్ధితో దూసుకుపోతోందని కామ్ స్కోర్ రిపోర్ట్ వెల్లడించింది. అంటే ఏసియా నెట్ బ్రాండ్ ప్రేక్షకులకు ఎంతగా దగ్గరయ్యిందో అర్థమవుతుంది. 

ఏసియానెక్ట్స్ డిజిటల్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించిన పాన్ ఇండియా సంస్థ. ఏసియా నెట్  ఏకంగా ఎనిమిది భాషల్లో సేవలు అందిస్తోంది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ్, హింది, ఇంగ్లీష్, బెంగాళి, మరాఠీ భాషల్లో వార్తలు అందిస్తోంది. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారికి నచ్చిన కంటెంట్ అందిస్తోంది ఏసియా నెట్. దీంతో రోజురోజుకు ఈ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలోని ప్రముఖ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ వృద్ధి తో పోల్చితే Asianet vriddhi అగ్రస్థానానికి చేరుకుంది.  ఇక ప్రతినెలా యాక్టివ్ యూజర్స్  ను పెంచుకుంటూ 80 శాతం వృద్దితో వీక్షకులను సొంతం చేసుకుంటోంది. 

Latest Videos

ఏసియా నెట్ జైత్రయాత్రపై సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమర్థ్ శర్మ స్పందించారు. మొదట స్థానికంగా సత్తాచాటి తామేంటో నిరూపించుకున్నామని... ఈ పునాదులపైనే ఇప్పుడు జాతీయ స్థాయికి చేరుకున్నామని అన్నారు.   డిజిటల్ మీడియా రంగంలో ఏసియా నెట్ అద్భుతాలు చేస్తోంది... అందుకు నిదర్శనమే ఈ వృద్దిరేటు అని అన్నారు. ఈ విజయంలో పాలుపంచుకున్న ఏసియానెట్ బృందం, భాగస్వాములకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.   ముఖ్యంగా ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ సంస్థను ఈ స్థాయికి చేర్చిన ఉద్యోగులను సమర్థ్ శర్మ అభినందించారు. 

ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ కోహ్లీ కూడా ఏసియా నెట్ న్యూస్ పురోగతిపై ఆనందం వ్యక్తం చేసారు. డిజిటల్ రంగంలో ఏసియానెట్ న్యూస్ మరో మైలురాయిని దాటిందని... దీన్ని సాకారం చేసిన ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ విజయం టీం నిబద్దత,  సృజనాత్మకతకు నిదర్శమని అన్నారు. ఇదే వృద్దిని కొనసాగిస్తూ పాన్ ఇండియా ప్రేక్షకులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. డిజిటల్ రంగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటామని తెలిపారు. మరింత సామర్థ్యంతో పనిచేసి మరిన్ని అద్భుత విజయాలు అందుకుంటామని నీరజ్ కోహ్లీ దీమా వ్యక్తం చేసారు.  

ఏసియా నెక్ట్స్ కేవలం డిజిటల్ రంగంలోనే కాదు టెలివిజన్, ప్రింట్ మరియు మ్యూజిక్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రేక్షకులకు అందిస్తూనే ఆకట్టుకునే కంటెట్ ను కూడా అందిస్తోంది.  దీంతో ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకు మరింత పెరిగి ప్రస్తుతం ప్రతినెలా 110 మిలియన్స్ మందికి చేరువ అవుతోంది. అలాగే ఏసియా నెట్ కు 30 మిలియన్స్ సోషల్ మీడియా ఫాలోవర్స్ వున్నారు.  ఈ లెక్కలే ఏసియా నెట్ పై ప్రజల అభిమానం ఏ స్థాయిలో వుందో తెలియజేస్తుంది.

click me!