భారతీయ విద్యార్థులకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పాడు. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదివే విద్యార్థులకు ఐదేళ్ల పోస్ట్ స్టడీ వీసాలు ఇస్తామని ప్యారిస్ ( France) పర్యటనలో ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం పారిస్ చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు మొదట లా సెయిన్ మ్యూజికేల్‌లో భారతీయ సమాజాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. భారతీయులను ఉద్దేశించి మోదీ పలు కీలక విషయాలు చెప్పారు. మోదీ ప్రసంగంలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం, జీ20, చంద్రయాన్-3 ప్రయోగం, భారతీయ విద్యార్థుల కోసం లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా వంటి అంశాలను ప్రస్తావించారు.
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ విద్యార్థులకు పలు వరాలు ఇచ్చారు. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఇప్పుడు ఐదేళ్ల దీర్ఘకాలిక పోస్ట్ స్టడీ వీసా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. గతంలో భారతీయ విద్యార్థులకు రెండేళ్ల వర్క్ వీసా ఇచ్చేవారు. తాను చివరిసారి ఫ్రాన్స్‌కు వచ్చినప్పుడు ఫ్రాన్స్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు 2 సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ వీసా ఇవ్వాలని నిర్ణయించబడింది. ఇప్పుడు.. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదివే భారతీయ విద్యార్థులకు దీర్ఘకాలిక 5 సంవత్సరాల పోస్ట్ స్టడీ వీసా ఇవ్వాలని నిర్ణయించబడిందని ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు.
రూపాయల్లో యూపీఐ చెల్లింపులు చేసేలా ఒప్పందం
ప్రధాన మంత్రి తన ప్రసంగంలో UPIలో భారతదేశ వృద్ధిని కూడా ప్రశంసించారు.ఫ్రాన్స్‌లో భారతదేశం UPI వినియోగం కోసం ఒక ఒప్పందం కుదిరింది. ఇది ఈఫిల్ టవర్ నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భారతీయ పర్యాటకులు UPI ద్వారా రూపాయిలలో చెల్లింపులు చేయగలుగుతారని కూడా ప్రధాని మోదీ చెప్పారు.
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటనను ప్రత్యేకమైనదని పిలిచారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ పరేడ్‌కు హాజరవుతారు. భారతదేశం,ఫ్రాన్స్‌లది విడదీయరాని స్నేహమని పేర్కొన్నారు.