'ఫ్రాన్స్‌తో వ్యక్తిగత అనుబంధం పాతదే'.. 40 ఏళ్ల నాటి ప్రధాని మెంబర్ షిప్ కార్డు వైరల్..   

Published : Jul 14, 2023, 05:22 AM IST
'ఫ్రాన్స్‌తో వ్యక్తిగత అనుబంధం పాతదే'..  40 ఏళ్ల నాటి ప్రధాని  మెంబర్ షిప్ కార్డు వైరల్..   

సారాంశం

PM Modi France Visit: రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. 40 సంవత్సరాల క్రితం అలయన్స్ ఫ్రాన్కైస్ సభ్యత్వం గురించి పంచుకున్నారు. 40 ఏళ్ల సభ్యత్వ కార్డు నేడు నెట్టింట్లో వైరల్ గా మారింది.   

PM Modi France Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సమయంలో పారిస్‌లో ఏర్పాటు చేసిన "నమస్తే ఫ్రాన్స్" అనే కార్యక్రమంలో  ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. 

ఫ్రాన్స్ తో తనకున్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.  దాదాపు 40 ఏళ్ల క్రితం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఫ్రాన్స్ సాంస్కృతిక కేంద్రాన్ని (అలయన్స్ ఫ్రాంకైస్‌ )ప్రారంభించినప్పుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఫ్రాన్స్ తో తన బంధం పాతదేనని,  తాను 40 సంవత్సరాల క్రితమే.. అలయన్స్ ఫ్రాంకైస్‌లో సభ్యత్వం తీసుకున్నాననీ, అందులో నమోదు చేసుకున్న మొదటి వ్యక్తి తానేనని అన్నారు.

ప్రధాని మోడీ ఇలా అన్నాడు, "ఫ్రెండ్స్, వ్యక్తిగతంగా ఫ్రాన్స్ అంటే చాలా అభిమానం. దాదాపు నలభై సంవత్సరాల క్రితం అహ్మదాబాద్‌లోని ఫ్రాన్స్ చెందిన అలయన్స్ ఫ్రాంకైస్‌  (సాంస్కృతిక కేంద్రం) ప్రారంభమైంది. ఈ రోజు అందులో సభ్యత్వం తీసుకున్న మొదటి సభ్యుడు నేనే.  ఆనాటి ఆ గుర్తింపు కార్డు.. నేటీకి కూడా నాకు విలువైనది." అని పేర్కొన్నారు.  అలయన్స్ ఫ్రాంకైస్ అనేది శతాబ్దాల నాటి సంస్థ. ఇది విదేశాలలో ఫ్రెంచ్ భాష , సంస్కృతిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  

రెండు రోజుల పర్యటన నిమిత్తం  ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరుపనున్నారు. అలాగే.. ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు.  పారిస్‌లో ప్రధాని మోదీ చేపట్టిన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్‌లో ఫ్రెంచ్ నాయకత్వం, భారతీయ ప్రవాసులు, CEOలు, ప్రముఖ వ్యక్తులతో భేటీ కానునున్నారు. 

తన పర్యటన ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. మాక్రాన్‌తో ప్రధాని మోదీ జరిపే చర్చల్లో ద్వైపాక్షిక రక్షణ సంబంధాల విస్తరణ కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం లేదా పారిస్‌లో జరిగే బాస్టిల్ డే వేడుకల్లో ప్రెసిడెంట్ మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొననున్నందున తన ఫ్రాన్స్ పర్యటన ప్రత్యేకమైందని మోదీ అన్నారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !