మన్ కీ బాత్ రికార్డు: 100 కోట్ల శ్రోతలను చేరుకుందని తేల్చిన ఐఐఎం సర్వే

Published : Apr 24, 2023, 08:08 PM IST
మన్ కీ బాత్  రికార్డు: 100  కోట్ల శ్రోతలను  చేరుకుందని తేల్చిన  ఐఐఎం సర్వే

సారాంశం

మన్  కీ బాత్  100  కోట్ల శ్రోతలను చేరుకుంది. ఈ మేరకు  ఐఐఎం సర్వే తేల్చింది.  ఐఐఎం  రోహతక్  సర్వే  నివేదికను  ధీరజ్  ఇవాళ విడుదల చేశారు.   

న్యూఢిల్లీ; ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం  100  కోట్ల శ్రోతలకు  చేరింది.  ఐఐఎం సర్వే ఈ విషయాన్ని  తెలిపింది.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ  నెలవారీ  నిర్వహిస్తున్న మన్  కీ బాత్  కార్యక్రమం గురించి  జనాభాలో  దాదాపు 96 శాతం  ప్రజలకు తెలుసునని ఈ సర్వే తేల్చింది.  ఐఐఎం  రోహతక్ నిర్వహించిన  అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి.  ఐఐఎం  రోహతక్ డైరెక్టర్  ధీరజ్ పి.శర్మ, ప్రసారభాతి  సీఈఓ  గౌరవ్ ద్వివేది లు  ఈ విషయాన్ని మీడియాకు  వివరించారు. 23 కోట్ల మంది  ప్రజలు  క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వింటున్నారని  వారు  చెప్పారు.  మరో  41 కోట్ల మంది మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అప్పుడప్పుడూ  వింటున్నారని  వివరించాు. 

మన్ కీ బాత్ కార్యక్రమానికి అత్యంత జనాధారణ  కలగడానికి గల కారణాలను  అన్వేషిస్తున్నారు.   శ్రోతలతో  భావోద్వేగ సంబంధాన్ని  ఏర్పరచుకొన్నందునే  మన్ కీ బాత్ ను  ప్రజలు ఆదరిస్తున్నారన  అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  ఇప్పటివరకు  నిర్వహించిన 99 మన్ కీ బాత్ కార్యక్రమాలపై  కూడా ఐఐఎం అధ్యయనం చేసింది. 

మెజారిటీ ప్రజలు   ప్రభుత్వాల పనితీరు గురించి తెలుసుకున్నారని  ఈ అధ్యయనం  తెలుపుతుంది. 73 శాతం ప్రజలు ప్రభుత్వం తీరుపై  ఆశాజనకంగా  ఉన్నారని  ఈ రిపోర్టు తెలుపుతుంది. 58 శాతం శ్రోతలు తమ జీవన పరిస్థితులు మెరుగుపడినట్టుగా  చెప్పారు 63శాతం ప్రజలు  ప్రభుత్వం తీరుపై సానుకూలంగా  ఉన్నారు.  60 శాతం  ప్రజలు  దేశ నిర్మాణం పనిచేయడానికి  ఆసక్తిని చూపుతున్నారు.  

44.7 శాతం  ప్రజలు  టీవీల్లో  ఈ కార్యక్రమాన్ని వింటున్నారు.  37.6  శాతం  మొబైల్ లో  ఈ కార్యక్రమాన్ని వింటున్నారని  ఈ రిపోర్టు తెలిపింది. మొత్తం10003 మంది  ఈ సర్వేలో పాల్గొన్నారని  ఐఐఎం  డైరెక్టర్ చెప్పారు. ఇందులో  60 శాతం పురుషులు, 40 శాతం మంది మహిళలున్నారని  ఆయన వివరించారు.  68 రకాల వృత్తులు నిర్వహించే  వారు సర్వేలో పాల్గొన్నట్టటుగా  ధీరజ్ వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు