PM CARES For children: అనాథ పిల్లలకు కేంద్రం ఆర్థిక చేయూత‌.. రూ.10 లక్షల సాయం.. పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

Published : May 30, 2022, 01:54 PM ISTUpdated : May 30, 2022, 01:56 PM IST
PM CARES For children: అనాథ పిల్లలకు కేంద్రం ఆర్థిక చేయూత‌.. రూ.10 లక్షల సాయం.. పథకాన్ని ప్రారంభించిన ప్రధాని

సారాంశం

PM Cares For Children: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఈ పథకం కింద  కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వనున్న‌ది.  

PM Cares For Children: కరోనా క‌ష్ట‌కాలం స‌మ‌యంలో ఎంతో మంది జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. అనేక మంది ఉఫాది లేక‌ రోడ్డున ప‌డ్డారు. ఎంతో మంది క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు. చాలా మంది పిల్ల‌లు తల్లిదండ్రులకు దూరమ‌య్యారు. కరోనా సమయంలో ఎంతో మంది పిల్లలు త‌మ త‌ల్లిదండ్రులను  కోల్పోయి .. అనాథలు మారారు. అలాంటి ఆనాథ పిల్ల‌ల‌కు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. వారికి ఆర్థిక చేయూతనివ్వ‌లనే ఉద్దేశంతో..  పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ స్కీమ్  (PM CARES for children Scheme)ను రూపొందించింది. ఈ ప‌థ‌కాన్ని ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ స‌మ‌యంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆస్పత్రుల్లో అనేక‌ మౌలిక సదుపాయాలను అందించాం. రోగుల కోసం వెంటిలేటర్ల కొనుగోలు, ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ నిధులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఇప్పుడు ఆ నిధుల‌ను ఆనాథులుగా మారిన పిల్లల కోసం.. ఉపయోగించ‌నున్నాం.. క‌రోనా స‌మ‌యంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు ఎలాంటి ద‌య‌నీయ‌మైన జీవితాల‌ను గ‌డుపుతున్నారో అంద‌రికీ తెలుసు. అలాంటి పిల్ల‌ల‌కు ఆర్థిక చేయూత నివ్వాల‌నే ఉద్దేశ్యం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్  (PM CARES for children Scheme) పథకాన్నిరూపోందించాం.. 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ప్రతి నెలా నిర్ణీత స్టైఫండ్, 23 ఏళ్లు నిండితే వారికి రూ.10 లక్షలు అందిస్తాం.. అలాగే.. వారికి ఆయుష్మాన్ హెల్త్ కార్డుల (Ayushman Bharat Health Cards)తో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే..?   

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో కరోనా వ‌ల‌న తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు లేదా దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని అర్హులు. ఈ పథకానికి అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు 'పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌' పేరుతో పోర్టల్‌‌లో న‌మోదు చేసుకోవాలి. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇవాళ్టి నుంచే పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

  
ప్రధాని మోదీ చేసిన  ప్రకటనలను ఒకసారి పరిశీలిద్దాం:

* రాష్ట్రం ద్వారా రూ. 50,000 ఎక్స్-గ్రేషియా సహాయం

* 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న ఆనాథ‌ పిల్లలకు నిర్ణీత స్టైఫండ్, 23 ఏళ్లు నిండితే వారికి రూ.10 లక్షలు అందుతాయి.

*కరోనావైరస్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్యనందిస్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో పాఠశాల ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యా హక్కు నిబంధనల ప్రకారం ఉంటుంది.

* 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVలు), నేతాజీ సుభాష్ చంద్రబోస్ (NSCB), జవహర్ నవోదయ విద్యాలయాలు (JNV) రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా ఉచిత విద్య అందించబడుతుంది.

* సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి1వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంవత్సరానికి 20,000 రూపాయల స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.

* ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశం, విద్య కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా సంవత్సరానికి రూ. 2.5 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందించబడుతుంది.

* విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా కాలేజ్, యూనివర్శిటీ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్  

* ఉన్నత విద్యాశాఖ-ఏఐసీటీఈ అందించే సాంకేతిక విద్య కోసం సంవత్సరానికి రూ.50,000 స్వనాథ్ స్కాలర్‌షిప్ పథకం

* 10వ తరగతి తర్వాత స్కూల్ డ్రాపౌట్‌లకు నైపుణ్య శిక్షణ కోసం AICTE యొక్క కర్మ పథకం (DoHE-AICTE) వ‌ర్తింపు

* భారతదేశంలో వృత్తిపరమైన కోర్సులు, ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు పొందేందుకు సహాయం. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ద్వారా విద్యా రుణం.. ఆ లోన్‌కు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం