UPSC Results 2021: సివిల్స్ ఫలితాలు విడుదల.. మెరిసిన తెలుగు తేజాలు.. యశ్వంత్ కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్..

Published : May 30, 2022, 01:38 PM ISTUpdated : May 30, 2022, 02:32 PM IST
UPSC Results 2021: సివిల్స్ ఫలితాలు విడుదల.. మెరిసిన తెలుగు తేజాలు.. యశ్వంత్ కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్..

సారాంశం

సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోవారం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది.  

సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోవారం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది.  సివిల్స్‌లో  శృతి శర్మ మొదటి ర్యాంక్, అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా.. మూడో ర్యాంక్ సాధించారు. సివిల్స్ -2021లో తెలుగువారి విషయానికి వస్తే యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించారు. పూసపాటి సాహిత్య.. 24వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి.. 56వ ర్యాంకు, శ్రీపూజ.. 62వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి.. 69వ ర్యాంకు, ఆకునూరి నరేశ్.. 117వ ర్యాంకు, అరుగులు స్నేహ.. 136వ ర్యాంకు, బి చైతన్య రెడ్డి.. 161వ రెడ్డి, ఎస్ కమలేశ్వర్ రావు.. 297వ ర్యాంకు, విద్యామరి శ్రీధర్.. 336వ ర్యాంకు, దిబ్బడ ఎస్వీ అశోక్.. 350వ ర్యాంకు, గుగులావత్ శరత్ నాయక్.. 374వ ర్యాంక్, నల్లమోతు బాలకృష్ణ.. 420వ ర్యాంకు, ఉప్పులూరి చైతన్య.. 470వ ర్యాంకు, మన్యాల అనిరుధ్.. 564వ ర్యాంకు, రంజిత్‌కుమార్.. 574వ ర్యాంకు, పాండు విల్సన్.. 602వ ర్యాంకు, బాణావత్ అరవింద్.. 623వ ర్యాంకు, బచ్చు స్మరణ్ రాజ్.. 676వ ర్యాంకు సాధించారు. సివిల్స్-2021 పూర్తి ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఈసారి మొత్తం 685 మందిని ఎంపిక చేయగా..  వీరిలో జనరల్ కోటా నుంచి 244 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 73 మంది, ఓబీసీ నుంచి 203 మంది, ఎస్సీ కేటగిరి నుంచి 105 మంది, ఎస్టీ కేటగిరి నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. 

నేడు ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో అమ్మాయిలే నిలిచారు. శృతి శర్మ ఆల్‌ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. శృతి సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో UPSC సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంది. 

ఇక, యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్-2021 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది అక్టోబర్ 21న నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 29న విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు main examination నిర్వహించారు. ఈ ఫలితాలు మార్చి 17న ప్రకటించారు. అందులో అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చివరిగా నేడు తుది ఫలితాలను విడుదల చేశారు. 

ఇక, UPSC Civil Services 2020లో మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వారిలో 545 మంది పురుషులు మరియు 216 మంది మహిళలు ఉన్నారు. ఆ పరీక్షలో శుభం కుమార్ ప్రథమ స్థానంలో నిలవగా, జాగ్రతి అవస్థి ద్వితీయ స్థానంలో, అంకిత జైన్ తృతీయ స్థానంలో నిలిచారు.

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?