గవర్నర్ల నియామకం: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మోడీ పెద్దపీట

By narsimha lodeFirst Published Jul 6, 2021, 1:56 PM IST
Highlights

 రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు  మోడీ పెద్ద పీట వేశారు. గవర్నర్లుగా  మ:హిళలకు కూడ ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.
 

న్యూఢిల్లీ:  రారాష్ట్రాల గవర్నర్ల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు  మోడీ పెద్ద పీట వేశారు. గవర్నర్లుగా  మ:హిళలకు కూడ ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.
. గవర్నర్లుగా  మ:హిళలకు కూడ ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.ప్రస్తుతం ముగ్గురు జాట్ నాయకులు గవర్నర్లుగా పనిచేస్తున్నారు. అలాంటి గౌరవం అసమానమైంది.ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు గవర్నర్లుగా నియమించారు.

కర్ణాటక గవర్నర్‌గా  థావర్ చంద్ గెహ్లాట్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన గతంలో మంత్రిగా కూడ పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కూడ ఎస్సీ వర్గానికి చెందిన రాజేం్ర ఆర్లేకర్ ను నియమించారు. ప్రస్తుతం ఆయన గోవా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ ఆర్య బాధ్యతలు చేపట్టనున్నారు.  బేబీ రాణిమౌర్య ప్రస్తుతం ఉత్తరాఖండ్ గవర్నర్ గా బాద్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక గిరిజనులకు కూడ గవర్నర్ల కేటాయింపులో పెద్దపీట వేసింది మోడీ సర్కార్. మంగుబాయ్ పటేల్ ను మధ్యప్రదేశ్ కు గవర్నర్ గా నియమించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన పటేల్  సుధీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి అనసూయ ఊకే గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఓబీసీలకు కూడ గవర్నర్ గా  పలు రాష్ట్రాల్లో బాధ్యతలు అప్పగించారు.

పగ్ చౌహాన్  బీహార్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్  గవర్నర్ గా  రమేష్ బాయ్‌ని నియమించారు.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా  బదిలీ చేశారు. సిక్కిం గవర్నర్ గా  గంగా ప్రసాద్ చౌరాసియాను నియమించారు. తెలంగాణ గవర్నర్ గా తమిళిసై బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరో వైపు జాట్ సామాజిక వర్గం నుండి  ముగ్గురు గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టారు. జగదీప్ జంకర్  పశ్చిమబెంగాల్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆచార్య దేవ్రత్ గుజరాత్ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. మేఘాలయ గవర్నర్ గా సత్యపాల్  మాలిక్  కొనసాగుతున్నారు.

కేరళ గవర్నర్ గా ఆరిఫ్ మహమ్మద్, మణిపూర్ గవర్నర్ గా నజ్మాహెప్తుల్లా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడ ముస్లిం వర్గానికి చెందినవారు. ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమించారు. హైద్రాబాద్ కు చెందిన  బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ నుండి హర్యానాకు బదిలీ చేశారు.

click me!