
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం నాడు సాదరంగా స్వాగతం పలికారు.
మంగళవారం నాడు ఉదయం ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్ కు చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో కోవింద్ దంపతులతో పాటు ప్రధానమంత్రి మోడీ ట్రంప్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు.
Also read:మెలానియా ట్రంప్ డ్రెస్: పారిస్ నుండి తెప్పించి...
రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి కోవింద్ ఇవాళ రాత్రి విందును ఇవ్వనున్నారు. ఈ విందులో 8 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడ హాజరుకానున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విందుకు హాజరుకానున్నారు. ఈ విందులో పాల్గొనేందుకు గాను కేసీఆర్ మంగళవారం నాడు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి భవన్ నుండి ట్రంప్ దంపతులు నేరుగా రాజ్ ఘాట్ వద్దకు చేరుకొన్నారు.