మార్చిలో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

Published : Feb 25, 2020, 10:19 AM IST
మార్చిలో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

సారాంశం

మార్చి 6వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ల స్వీకరణకు తుదిగడువుగా ప్రకటించారు. మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. 

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ని మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read ఒకవైపు ట్రంప్ పర్యటన... మరో వైపు ఢిల్లీలో అల్లర్లు.. నలుగురు మృతి...

మార్చి 6వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ల స్వీకరణకు తుదిగడువుగా ప్రకటించారు. మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 18వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా తేల్చారు. ఇక మార్చి 26వ తేదీన రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9గంటలకు మొదలై సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ సాగనుంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !