వెంకయ్య నాయుడు పని విధానం స్పూర్తి దాయకం.. రాజ్యసభలో ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Aug 8, 2022, 12:26 PM IST
Highlights

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు.
 

ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడుపై ప్రశంసలు కురిపించారు.‘‘రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీకాలం ముగింపు సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈరోజు మనమందరం ఇక్కడకు వచ్చాం. ఈ సభకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. రాజ్యసభ అనేక చారిత్రక క్షణాలు మీ మనోహరమైన ఉనికితో ముడిపడి ఉన్నాయి. రాజకీయాల నుంచి రిటైరయ్యాను.. కానీ ప్రజా జీవితం నుండి అలసిపోలేదు అని మీరు చాలా సార్లు చెప్పారు. ఈ సభకు నాయకత్వం వహించే మీ బాధ్యత ఇప్పుడు ముగిసిపోవచ్చు.. కానీ దేశంతో పాటు ప్రజా జీవితంలోని నాయకులు, నాలాంటి వారు - మీ అనుభవాల ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు.

ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీని మనం గుర్తించినప్పుడు..  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానమంత్రి‌గా ఉన్న  స్వాతంత్ర్య దినోత్సవం. వీరంతా చాలా సాధారమైన బ్యాక్ గ్రౌండ్ కలిగినవారు. మా ఉపరాష్ట్రపతిగా మీరు యువజన సంక్షేమానికి చాలా సమయం కేటాయించారు. మీరు చేసిన చాలా కార్యక్రమాలు యువశక్తిపై కేంద్రీకరించబడ్డాయి. 

నేను వెంకయ్య నాయుడుతో కలిసి పనిచేశారు. ఏళ్ల తరబడి సన్నిహితంగా ఉన్నాను. ఆయన వివిధ బాధ్యతలను చేపట్టడం నేను చూశాను.  ప్రతి ఒక్కటి ఎంతో అంకితభావంతో నిర్వహించారు. సభా నాయకుడిగా ఎన్నో బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. మీ పని విధానం ఎంతో స్పూర్తి దాయకం. మీ అనుభవం.. మీ ప్రతి పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. మీ పుస్తకాలు ప్రజస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీ ఏకవాక్య సంభోదనలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. భాషలపై మీకున్న పట్టు ఎప్పుడూ గొప్పదే. భారతీయ భాషల పట్ల ఆయన  మక్కువ మెచ్చుకోదగినది. ఆయన రాజ్య సభకు అధ్యక్షత వహించిన తీరులో ఇది ప్రతిబింబించింది. రాజ్యసభ ఉత్పాదకతను పెంచడానికి ఆయన దోహదపడ్డారు’’అని మోదీ ప్రశంసలు కురిపించారు. 

ఇక, ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌కర్  ఆగస్టు 11న బాధ్యతలు చేపట్టున్నారు. 

click me!