
ఢిల్లీ : జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్ టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనర్ ఫైనల్ కీని మాత్రమే ఎన్ టీఏ విడుదల చేసింది. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి.రవికిశోర్ ఆరో ర్యాంకు సాధించగా ఎం.హిమవంశీ ఏడు, పల్లి జలజాక్షి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు.