ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీని ప్రత్యక్షంగా కలిసిన ప్రధాని మోడీ.. రష్యా యుద్ధం తర్వాత తొలిసారి కలయిక

Published : May 20, 2023, 05:16 PM IST
ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌ జెలెన్‌స్కీని ప్రత్యక్షంగా కలిసిన ప్రధాని మోడీ.. రష్యా యుద్ధం తర్వాత తొలిసారి కలయిక

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమైర్ జెలెన్‌స్కీని కలిశారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత తొలిసారి ఆయనను ప్రత్యక్షంగా కలిశారు. జపాన్‌లో నిర్వహిస్తున్న జీ7 సదస్సుకు హాజరు కావడానికి వీరిద్దరూ అక్కడికి వెళ్లారు.   

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమైర్ జెలెన్‌స్కీని కలిశారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత వీరిద్దరు ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే తొలిసారి. గతంలో ఫోన్‌ల ద్వారా మాట్లాడుకున్నారు. కానీ, నేరుగా కలుసుకోవడం ఇదే ప్రథమం. ప్రధాని మోడీ జీ7 సదస్సులో పాల్గొనడానికి జపాన్‌లోని హిరోషిమా నగరానికి ఈ రోజు వెళ్లారు. జెలెన్‌స్కీ కూడా ఈ సదస్సులో పాల్గొనడానికి జపాన్‌కు వచ్చారు. అక్కడ వీరిద్దరూ కలుసుకోవడం తటస్థించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం వీరి సమావేశానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.

ప్రధాని మోడీ ఈ రోజు ఉదయం జపాన్ నగరానికి వెళ్లారు. జీ7 సదస్సులో మూడు సెషన్లలో ఆయన పాల్గొనడానికి వెళ్లారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఈ పర్యటన మొదలు పెట్టారు. జపాన్ తర్వాత ఆయన పాపువా న్యూ గినియాకు, అటు నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

ప్రస్తుతం జీ7 దేశాల కూటమికి జపాన్ చైర్‌గా వ్యవహరిస్తున్నది. జపాన్ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సదస్సులో పాల్గొనడానికి వచ్చారు. 

Also Read: రూ. 2000 నోట్లు ఆచరణాత్మకమైన కరెన్సీ కాదని మోదీ నమ్ముతారు: పీఎం మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా..

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణలు శాంతియుత చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇది వరకే పలు మార్లు చెప్పారు. చర్చ, దౌత్యం ద్వారా మాత్రమే ఈ రెండు దేశాల మధ్య సఖ్యత తేవడం వీలవుతుందని తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి కోసం జరిగే ఏ ప్రయత్నంలోనైనా భారత్ భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నదని వివరించారు.

జపాన్‌కు వెళ్లిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని జపనీస్ న్యూస్ పేపర్ యొమురి షింబన్ ఓ కీలక ప్రశ్న వేసింది. యూఎన్ (ఐ రా స) తీర్మానం నుంచి భారత్ దూరంగా ఉండటం, రష్యా నుంచి చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకోవడం వంటి విషయాలతో భారత్‌ను విమర్శిస్తున్నవారికి ఏం సమాధానం ఇస్తారని అడిగింది. దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పారు. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి చర్చ, దౌత్య మార్గాలను ఎంచుకోవాలని భారత్ ఎప్పుడూ చెబుతుందని వివరించారు. అలాగే, అత్యవసర వస్తువులపై ధరల పెరుగుదల కారణంగా ప్రభావితమవుతున్న వారికీ తాము ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్