సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు ప్రధాని మోదీ శుభకాంక్షలు..

Published : May 20, 2023, 04:19 PM IST
సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు ప్రధాని మోదీ శుభకాంక్షలు..

సారాంశం

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌లు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

బెంగళూరు: కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘కర్ణాటక సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌లకు అభినందనలు. ఫలవంతమైన పదవీకాలం కోసం నా శుభాకాంక్షలు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్యకు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు సిద్ధరామయ్యకు, ఆయన మంత్రివర్గ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు’’ అని బసవరాజ్ బొమ్మైడు ట్వీట్ చేశారు.

Also Read: సీఎం జగన్ దంపతుల ఆశీస్సులతో.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే రాపాక కుమారుడి పెళ్లి పత్రిక..!

ఇదిలా ఉంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  మొత్తం 224 మంది సభ్యులున్న శాసనసభలో 135 స్థానాలను కైవసం చేసుకుని.. బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకుంది. ఎన్నికల్లో విజయం సాధించిన వారం రోజుల తర్వాత.. సీఎంగా సిద్ధరామయ్య,  డిప్యూటీ సీఎంగా శివకుమార్‌లతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 

Also Read: విశాఖలో దారుణం.. బీచ్‌లో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..!!

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు  ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు,  రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌, సీపీఐ నేత డి రాజా, సీపీఐ(ఎం) సీతారాం ఏచూరిలతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా  సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్